గత దశాబ్ద కాలంలో సౌత్ ఇండియాలో గొప్ప పేరు, ఫాలోయింగ్ సంపాదించిన నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఇప్పుడు బహు భాషల్లో అదిరిపోయే పాత్రలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు సేతుపతి. ఇటీవలే నటుడిగా విజయ్ సేతుపతి చేసిన 50వ చిత్రం మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు సక్సెస్ సెలబ్రేషన్లకు హాజరైన సేతుపతి మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి పుష్ప సినిమాలో విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని అడిగినా ఒప్పుకోలేదని అప్పట్లో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించారు. ఈ వార్తలను సేతుపతి ఖండించాడు.
పుష్ప సినిమాను తాను రిజెక్ట్ చేయలేదని విజయ్ సేతుపతి స్పష్టం చేశాడు. మరి వాస్తవంగా ఏం జరిగిందనే విషయం చెప్పడానికి అతను ఇష్టపడలేదు. కొన్నిసార్లు నిజాలు మాట్లాడకుండా ఉంటేనే మంచిదంటూ నవ్వేశాడు సేతుపతి. దీన్ని బట్టి పుష్ప విలన్ పాత్రకు ముందు సేతుపతిని అనుకుని.. తర్వాత సుకుమారే మనసు మార్చుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు తీసిన ఉప్పెనలో మాత్రం విలన్ పాత్రలో నటించాడు సేతుపతి. ఆ చిత్రానికి తాను తక్కువ పారితోషకం తీసుకున్నానని.. కేవలం బుచ్చిబాబు కోసమే ఆ చిత్రం చేశానని ఇంతకుముందు సేతుపతి చెప్పిన సంగతి తెలిసిందే.
మహారాజ సక్సెస్ సెలబ్రేషన్లకు వచ్చిన బుచ్చిబాబు.. సేతుపతి కాళ్లు మొక్కడం విశేషం. ఇక స్టేజ్ మీద సేతుపతి బుచ్చిబాబు గురించి గొప్పగా మాట్లాడాడు. బుచ్చి తన తమ్ముడి లాంటి వాడని.. అతను రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని అతను చెప్పాడు.
This post was last modified on June 18, 2024 8:11 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…