న్యాచురల్ స్టార్ నాని, బలగం వేణు దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేసుకుని నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పటిదాకా ఆ దిశగా ముందడుగు పడలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో బలంగా తిరుగుతోంది. అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు వేణు తయారు చేసిన కథ గ్రామీణ నేపథ్యంలో విభిన్నంగా ఉన్నప్పటికీ దసరాకు, త్వరలో శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే చిత్రంలోని పాయింట్ కు కాస్త సారూప్యంగా ఉండటంతో పాటు నెరేషన్ పరంగా పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లనే ఆగిందని తెలిసింది.
అధికారికంగా వివరాలు తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకంటే గతంలో దిల్ రాజు బయట ప్రైవేట్ ఈవెంట్స్ లో దీని గురించి చూచాయగా చెప్పారు తప్పించి అఫీషియల్ లాంఛ్ చేయలేదు. ఆయన ప్రస్తుతం సెలవుల మీద అమెరికాలో ఉండగా శిరీష్ ఇక్కడి వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఎల్లమ్మ అనే వర్కింగ్ టైటిల్ తో వేణు స్టోరీ రాసుకున్నాడు. పీరియాడిక్ డ్రామాలో నలభై ఏళ్ళ క్రితం ఒక గ్రామంలో జరిగిన నిజమైన ప్రేమకథను స్ఫూర్తిగా తీసుకున్నారని వినికిడి. వయొలెన్స్ తో పాటు ఎమోషన్ కూడా చాలా హెవీగా ఉందట. నానికి సూటయ్యే అంశాలు ఉండకపోయిండొచ్చు.
సో వేణు యెల్దండికి మంచి ఛాన్స్ మిస్ అయినట్టే. బలగం తర్వాత ఒక పెద్ద హీరోతో చేయాలని పట్టుదలగా ఉన్న వేణుకి ఒకవేళ ఇది నిజంగా క్యాన్సిలైన పక్షంలో ఎవరితో చేస్తాడనేది సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఎవరితో సినిమా చేసినా షూటింగ్, విడుదలకు ఎంతలేదన్నా ఏడాదికి పైగానే పడుతుంది. తన మనసులో ఇతర ఆప్షన్లు ఎవరు ఉన్నారో వేచి చూడాలి. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలు సైతం రెండేళ్ల దాకా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. సుజిత్ ది కూడా అనుమానంగా ఉంది కాబట్టి సరిపోదా శనివారం తర్వాత నాని చేసేది శ్రీకాంత్ ఓదెలదే కావొచ్చు.
This post was last modified on June 17, 2024 10:32 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…