పుష్ప 2 ది రూల్ వాయిదా గురించి విపరీతమైన చర్చ ఒకపక్క జరుగుతూ ఉండగానే ఇంకోవైపు ఆ డేట్ ని పట్టేసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. ఆగస్ట్ 15 లాంగ్ వీకెండ్ ఉన్న మంచి తేదీ కావడంతో ఆ అవకాశాన్ని వదులునేందుకు ఇతర నిర్మాతలు ఇష్టపడటం లేదు. అయితే డబుల్ ఇస్మార్ట్ శంకర్ బృందం డబుల్ తెలివితేటలతో ఆలోచించి తమ సినిమాని ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ వదిలేసింది. దీంతో అధికారికంగా ఆ స్లాట్ లో వచ్చిన మొదటి ప్యాన్ ఇండియా మూవీగా డబుల్ ఇస్మార్ట్ కు ఫస్ట్ ఎడ్జ్ దొరికేసింది.
నిజానికి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ డబుల్ ఇస్మార్ట్ జూలైలో తేవాలని దర్శకుడు పూరి జగన్నాధ్ విశ్వప్రయత్నం చేశారు. కానీ షూటింగ్ లో జాప్యం, ఓటిటి డీల్, సంజయ్ దత్ డేట్లు లాంటి బోలెడు కారణాలు ఆలస్యానికి దారి తీశాయి. ప్రస్తుతం కీలక షెడ్యూల్ చివర్లో ఉన్న ఈ మాస్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన టీజర్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ రిలీజైన సంగతి తెలిసిందే. దానికొచ్చిన మిశ్రమ స్పందనని దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ కట్ ప్రత్యేకంగా చేయిస్తున్నారట. మణిశర్మ స్వరపరిచిన పాటల తాలూకు లిరికల్ వీడియోలు ఈ నెలాఖరు నుంచే రాబోతున్నాయి.
మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 పోస్ట్ పోన్ గురించి చెప్పకపోయినా ఇప్పుడు పూరి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. రామ్ కు అత్యవసరంగా హిట్టు కావాల్సిన టైంలో వస్తున్న సినిమా ఇది. లైగర్ డిజాస్టర్ చేసిన గాయం నుంచి బయటపడి మళ్ళీ తన సత్తా చాటుకునేందుకు పూరి జగన్నాధ్ కు ఇదే చావో రేవో ఆటగా మారిపోయింది. ఇస్మార్ట్ శంకర్ కు మించిన డోస్ ఇందులో ఉంటుందనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది. ది వారియర్, స్కందల తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిది. తెలుగులో పుష్ప 2 కాకుండా అఫీషియల్ గా ఆ డేట్ ని లాక్ చేసింది ఇప్పటికి డబుల్ ఇస్మార్ట్ ఒక్కటే.
This post was last modified on June 15, 2024 3:59 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…