నిన్న విడుదలైన సినిమాల్లో బజ్ పరంగా హరోంహర, మహారాజ ముందంజలో ఉండటంతో మ్యూజిక్ షాప్ మూర్తి వెనుకబడింది. టీమ్ చక్కని ప్రమోషన్లు చేయడం, టైటిల్ రోల్ పోషించిన అజయ్ ఘోష్ మీకు నచ్చకపోతే నన్ను బూతులు తిట్టండని పబ్లిక్ గా ఫోన్ నెంబర్ ఇవ్వడంతో కొంత మేర ప్రేక్షకుల దృష్టి దీనిపైకి మళ్లింది. పబ్లిక్ టాక్ తో మెల్లగా పికప్ అవుతామనే నమ్మకంతో ఓపెనింగ్స్ రావని తెలిసినా ఇంత పోటీలో థియేటర్లకు తీసుకొచ్చారు. శివ పాలడుగు దర్శకత్వం వహించగా పవన్ సంగీతం అందించారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుని హీరోగా మార్చిన ఈ మ్యూజిక్ షాప్ మూర్తి మెప్పించేలా ఉన్నాడా.
ఇంటర్నెట్ కాలంలో ఎవరూ కొనని ఆడియో క్యాసెట్ల షాపుతో మధ్యతరగతి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మూర్తి(అజయ్ ఘోష్). సెల్ ఫోన్ దుకాణం పెట్టమని భార్య(ఆమని) ఎంత పోరు పెడుతున్నా పట్టించుకోడు. ఓ సందర్భంలో ఇతని టాలెంట్ గమించిన కొందరు డీజేగా మారమని సలహా ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇలాంటి ఆలోచనే ఉన్న సంజన(చాందిని చౌదరి) పరిచయమవుతుంది. ఆ అమ్మాయే మూర్తికి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది. డీజే అవ్వాలనే లక్ష్యంతో ఉన్న మూర్తికి వ్యక్తిగత జీవితం దెబ్బ తింటుంది. చివరికి ఏం చేశాడు, గోల్ ఎలా సాధించాడనేది కథ.
దర్శకుడు శివ తీసుకున్న పాయింట్ కొత్తదే. కాకపోతే అజయ్ ఘోష్ లాంటి ఆర్టిస్టుని సపోర్టింగ్ రోల్స్ లో చూసి చూసి ఒక్కసారిగా థియేటర్ స్క్రీన్ మీద అంత నిడివితో చూడటమనే ప్రిపరేషన్ ప్రాధమికంగా లేకపోవడం వల్ల సన్నివేశాలు, ఎమోషన్ ఎంత బాగా పండినా వాటి రీచ్ పరిమితంగా మారిపోయింది. పైగా మూర్తి డీజే కావాలనుకుని చేసే ప్రయాణంలో డ్రామాని విపరీతంగా జొప్పించడంతో ఎంటర్ టైన్మెంట్ పక్కకెళ్ళిపోయి సెంటిమెంట్ డామినేట్ చేసేసింది. దీంతో ఊహాతీతంగా ఏదీ జరగకపోవడం మైనసయ్యింది. పాటల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది. అంచనాలు లేకుండా వెళ్తేనే మూర్తి ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తాడు.
This post was last modified on June 15, 2024 10:11 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…