కమర్షియల్ గా రికార్డులు తిరగరాయకపోయినా సబ్జెక్టులో ఉన్న సెన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభను గొప్పగా బయటికి తీసింది. బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయం నమోదు చేసుకుంది. నాని సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కు తోడు స్నేహితుడు రిషిగా విజయ్ దేవరకొండ నటన తనకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇది చూసే సందీప్ రెడ్డి రంగా అర్జున్ రెడ్డి అవకాశం ఇచ్చి ఉంటారని అభిమానులు భావిస్తారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోని తెరమీద చూసే ఛాన్స్ దక్కలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఆ అవకాశం దక్కిందని టాక్.
కల్కి 2898 ఏడిలో నాని కృష్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కాసేపు క్యామియోల్లో కనిపిస్తారనే లీక్ ఆసక్తికరంగా ఉంది. మహాభారత హీరోలకు కల్కితో ఏం పనంటే దీని వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంటుందట. ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా నాగఅశ్విన్ చేయించే ప్రయాణంలో భాగంగా ఈ ఇద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. ట్రైలర్ వచ్చాక కొందరు ప్రభాస్ భైరవ అయితే కల్కి విజయ్ దేవరకొండ అంటూ కొత్త విశ్లేషణలు చేశారు. కానీ అవి నిజం కావు. కల్కిగా వేరొకరు ఉండరు. ఇది మాత్రం పక్కా. అయితే ముగ్గురి కాంబోలో సన్నివేశాలు ఉంటాయా లేదానేది వేచి చూడాలి.
వైజయంతి, స్వప్న సంస్థల్లో సినిమాలు చేసినవాళ్ళందరూ చిన్నదో పెద్దదో ఏదో ఒక క్యారెక్టర్ ద్వారా కల్కిలో భాగమయ్యారని ముందు నుంచి వినిపిస్తున్న మాట. బయటికి చెప్పకుండా కేవలం స్క్రీన్ మీద మాత్రమే సర్ప్రైజ్ ఇవ్వాలని దాచినవి కూడా జూన్ 27నే తెలియబోతున్నాయి. అంచనాలపరంగా ఆకాశాన్ని దాటి ప్రయాణిస్తున్న కల్కి 2898 ఏడి రిలీజ్ కు ఇంకో పదమూడు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచాలని అభిమానులు కోరుతున్నారు. సరిపడా హైప్ ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తదితర కార్యక్రమాలతో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని వాళ్ళ కోరిక.
This post was last modified on June 14, 2024 10:08 am
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…