టాలీవుడ్ నుంచి మరో ప్రపంచ స్థాయి సినిమా సిద్ధమైంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల తర్వాత ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలదని అంచనాలున్న ఆ చిత్రమే.. కల్కి.
వైజయంతీ మూవీస్ బేనర్ మీద ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు.
ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూస్తే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘కల్కి’ ఉంటుందని అర్థమవుతోంది. ప్రేక్షకుల్లో సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలు రిలీజ్ దగ్గర పడేసరికి ఇంకా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు యుఎస్ సహా పలు దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ ప్రి సేల్స్ గట్టిగానే జరుగుతున్నాయి.
యుఎస్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రి సేల్స్ సాధించిన ఇండియన్ మూవీగా ‘కల్కి’ రికార్డు సృష్టించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది. ‘కల్కి’ ప్రి సేల్స్ మొదలై కొన్ని రోజులే అయింది. ఈ లోపే 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది.
రిలీజ్ లోపే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును కూడా అందుకోవడం లాంఛనమే. వీకెండ్లోనే 5 మిలియన్ క్లబ్బులో కూడా అడుగు పెట్టొచ్చు. టాక్ బాగుంటే ‘ఆర్ఆర్ఆర్’ను అధిగమించి ‘బాహుబలి-2’ రికార్డులకు కూడా చేరువగా వెళ్లొచ్చు.
ఈ నెల 27న ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు కూడా పాతర వేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on June 13, 2024 5:37 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…