ఐపీఎల్ అయిపోయింది. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోయింది. టి20 ప్రపంచ కప్ జరుగుతున్నా జనాలకు దాని మీద అంత ఉత్సాహం కలగడం లేదు. గత రెండు మూడు వారాల్లో వచ్చిన కొత్త సినిమాలేవీ ఆశించిన కిక్ ఇవ్వలేకపోయాయి.
అంచనాలు మోసుకున్న శర్వానంద్ మనమే, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిలు యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు అందరి కన్ను జూన్ 14 మీద ఉంది. చెప్పుకోదగ్గ కౌంట్ వస్తున్నాయి కానీ పెద్ద రేంజ్ ఉన్న స్టార్ హీరోలవి లేకపోవడంతో కంటెంట్, టాక్ ఈ రెండూ చాలా కీలకం కాబోతున్నాయి.
సుధీర్ బాబు ‘హరోంహర’ వీటిలో మొదటిది. ట్రైలర్ చూశాక అంచనాలు మొదలయ్యాయి. కుప్పం బ్యాక్ డ్రాప్ లో తుపాకులు తయారు చేసే సుబ్రహ్మణ్యం కథగా దర్శకుడు జ్ఞాన సాగర్ తెరకెక్కించాడు. అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఏదైనా అద్భుతం చేస్తేనే ఆడియన్స్ వస్తారు.
టీమ్ అయితే నమ్మకంగానే ఉంది. చాందిని చౌదరి ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ‘యేవమ్’ బజ్ పరంగా వెనుకబడినా మెప్పిస్తామనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. ఫాంటసీ మూవీ ‘ఇంద్రాణి’తో పాటు చిన్న సినిమా ‘నీ దారే నీ కథ’కు బాగానే పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇవన్నీ స్ట్రెయిట్ చిత్రాలు.
ఇక డబ్బింగ్ మూవీస్ సంగతి చూస్తే విజయ్ సేతుపతి ‘మహారాజ’ కోసం మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. మక్కల్ సెల్వన్ అదే పనిగా హైదరాబాద్ లో ఉండి మరీ ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తున్నాడు. కెజిఎఫ్ యష్ నటించిన పాత సినిమాని ‘రాజధాని రౌడీ’గా డబ్ చేశారు.
దీని ఒరిజినల్ కన్నడ వెర్షన్ యూట్యూబ్ లో ఉండటం అసలు ట్విస్టు. ఇవి కాకుండా బాలీవుడ్ మూవీ ‘చందూ ఛాంపియన్’ మీద అర్బన్ ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. పోటీ అయితే పైకి పెద్దగా కనపడుతోంది కానీ విజేతలుగా నిలిచి కలెక్షన్లు కొల్లగొట్టేదెవరో ఎల్లుండి దాకా వేచి చూడాలి.
This post was last modified on June 12, 2024 2:36 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…