బిగ్‍బాస్ తెలుగు ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తోంది కానీ గత సీజన్ల విజేతలలో కౌశల్ గుర్తున్నంతగా వేరే వాళ్లెవరూ గుర్తు లేరు. శివబాలాజీ, రాహుల్ సిప్లిగంజ్ ఏదో అలా గెలిచేసారు కానీ కౌశల్ మాత్రం తన ముద్రని బిగ్‍బాస్‍పై బలంగా వేసేసి పోయాడు. నిజం మాట్లాడుకుంటే… కౌశల్ అంత తెలివైనవాడు, గొప్ప ఆటగాడు కానే కాదు. ఆ సీజన్లో అతడిని కార్నర్ చేయడానికి మిగతా హౌస్ అంతా ఒక గ్రూప్ అయిపోవడంతో కౌశల్‍కి బయట అంతటి సపోర్ట్ వచ్చేసింది.
లోపల అతనొక్కడే ఆడుతోంటే… బయట అతనికోసం పెద్ద సైన్యమే పని చేసింది. గత సీజన్లో కౌశల్ మాదిరిగా ఎవరూ గేమ్ ఆడలేకపోయారు. కాకపోతే శ్రీముఖి మాత్రం ‘తేజస్వి’ మాదిరి కాకూడదని చాలావరకు తనను తాను అణచి వేసుకుంది. ఈ సీజన్లో కంటెస్టెంట్లను చూస్తోంటే కౌశల్‍లా ఆడాలనే ప్రయత్నం పలువురిలో కనిపిస్తోంది. బిగ్‍బాస్ అనేది చిత్రమయిన రియాలిటీ షో. జనాలకు ఎందుకు నచ్చుతారో తెలీదు, ఎలా వుంటే ఓట్లేస్తారో తెలీదు. అందుకే జనాన్ని ఆకట్టుకోవడానికి, కౌశల్‍లా ప్రేక్షకులని ఆకర్షించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.
టీవీ 9 దేవి అయితే కౌశల్ మాదిరిగానే ‘ఇక్కడంతా నాటకమాడుతున్నారు సర్’ అంటూ హౌస్‍లోని అందరికీ శత్రువు అయిపోతానని తెలిసినా కానీ నాగార్జునకి అందరిపైన కంప్లయింట్ చేసింది. దేవి ముక్కు సూటితనం ప్రేక్షకుల దృష్టిలో పడింది కానీ కౌశల్ మాదిరి ఫాలోయింగ్ రావడం అంత తేలిక కాదు. అందుకోసం అవతలో తేజస్వి, బాబు గోగినేని లాంటి వాళ్ళు తయారవ్వాలి. అఖిల్ అనే మరో ఆటగాడు ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతూ… ఎవరైనా ఎలిమినేట్ అయినపుడు కౌశల్ ఎలా బిహేవ్ చేసేవాడో అలాగే ప్రవర్తిస్తున్నాడు.
కౌశల్ పట్ల ప్రేక్షకులలో సింపతీ రావడం వల్లనే అతను విజేత అయ్యాడనే భావనతో నోయల్ చిన్నదానిని పెద్దది చేసేస్తూ సింపతీ కొట్టాలని చూస్తున్నాడు. అయితే సెకండ్ సీజన్ దెబ్బతో ఎవరో ఒకరిపై ఆడియన్స్ ఫోకస్ పడకుండా ఈసారి బిగ్‍బాస్ ఎడిటర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈసారి నిజంగా మరో కౌశల్ లాంటి ఆటగాడు తయారవుతాడా లేదా అనేది మరో రెండు వారాల్లోగా క్లారిటీ వచ్చేస్తుందిలెండి.
This post was last modified on September 21, 2020 11:17 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…