Movie News

కృతి శెట్టి గురి మళ్ళీ తప్పింది

మూడేళ్ళ క్రితం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఒక్కసారిగా డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా తనకే ఆఫర్లు క్యూ కట్టాయి. లుక్స్, నటన రెండూ బాగుండటంతో తక్కువ టైంలో టాప్ ప్లేస్ కి దూసుకుపోవచ్చని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ సూపర్ హిట్లు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు పలకరించాయి. దీంతో సహజంగానే మార్కెట్ మీద ప్రభావం పడింది.

సరే జరిగిందేదో జరిగింది శర్వానంద్ మనమేతో మళ్ళీ ట్రాక్ లో పడొచ్చనే కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది. కానీ తీరా చూస్తే మరీ బ్యాడ్ అనిపించుకోలేదు కానీ మనమే అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం. వీకెండ్ దాకా బాగానే లాకొచ్చినా సోమవారం నుంచి బాగా నెమ్మదించింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కనీసం రెండు వారాలు స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. ఈ శుక్రవారం ఆరు రిలీజులు థియేటర్లను బాగానే లాగేసుకుంటాయి. మనమే రెండో వారం అగ్రిమెంట్లు బాగానే జరిగాయి కానీ స్క్రీన్ కౌంట్ మరీ ఎక్కువ తగ్గకపోవచ్చు.

ఎలా చూసుకున్న మనమే ద్వారా కృతి శెట్టి జరిగిన మేలు పెద్దగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం తను తమిళంలోనే మూడు సినిమాలు చేస్తోంది. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జయం రవి జీనీలు వాటిలో ఉన్నాయి. ఇవి కనక విజయవంతమైతే కోలీవుడ్ లో జెండా పాతొచ్చు. తెలుగులో మాత్రం అవకాశాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఇమేజ్ ఉన్న హీరోల సరసన నటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న కృతి శెట్టి మొన్న ఏడాది బాలా దర్శకత్వంలో సూర్యతో ఓకే చేసుకున్న మూవీ క్యాన్సిల్ కావడం బ్యాడ్ లక్. మరి తమిళంలోనైనా జెండా పాతుతుందేమో చూడాలి.

This post was last modified on June 11, 2024 10:01 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

1 hour ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago