Movie News

తీవ్ర వివాదంలో అమీర్ కొడుకు సినిమా

కాంట్రావర్సీలు కేవలం థియేటర్ సినిమాలకే కాదు ఓటిటి రిలీజులకు కూడా ఉంటాయి. కాకపోతే డిజిటల్ ప్రపంచంలో అడ్డుకోవడానికి మార్గాలు తక్కువ. కోర్టుకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఈ నెల 14న అమీర్ ఖాన్ కొడుకు జునైద్ డెబ్యూ మూవీ మహారాజ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుందని పది రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇందులో తమ మనోభావాలు దెబ్బ తినే విషయాలు ఉన్నాయంటూ భజరంగ్ దళ్ వార్నింగ్ ఇవ్వడమే కాక ముందు తమకు ప్రైవేట్ స్క్రీనింగ్ చేశాకే ప్రదర్శన చేయాలని అల్టిమేటం ఇచ్చాయి. అసలు కథేంటో చూద్దాం.

1862లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాజ్ లైబిల్ కేసు ఆధారంగా దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా దీన్ని రూపొందించారు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కొందరి దుర్మార్గాల గురించి ఇందులో తెరకెక్కించారు. జునైద్ ఈ అక్రమాన్ని వెలికి తీసే జర్నలిస్ట్ గా నటించగా వల్లభాచార్య వర్గానికి చెందిన బ్రిజ్ రతన్ జీ మహారాజ్ గా జైదీప్ ఆహ్లావత్ కనిపిస్తారు. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే అసలు పాయింట్. అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించి విపరీతమైన శ్రమతో ఎంతో రీసెర్చ్ చేసి మరీ ఈ సబ్జెక్టుని తయారు చేసినట్టు టీమ్ చెబుతోంది.

ఇంకో నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. నెట్ ఫ్లిక్స్ ప్రమోషన్ చేయడం లేదు. దర్శక నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. అసలు ట్రైలరే రాలేదు. మరి భయపడి వాయిదా వేశారా లేక వివాదం ఉంది కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా రిలీజ్ చేస్తారానేది సస్పెన్స్ గానే ఉంది. జునైద్ ఖాన్ యాక్టింగ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏదో రెగ్యులర్ లవ్ స్టోరీ ఎంచుకోకుండా ఇలా కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ ని తీసుకోవడం వెనుక తండ్రి అమీర్ ప్రోత్సాహం ఉండే ఉంటుంది. చూడాలి మరి చెప్పిన టైంకి వస్తుందో లేక పోస్ట్ పోన్ చేసి నిరాశపరుస్తారో ఈ వారం తేలిపోతుంది.

This post was last modified on June 10, 2024 4:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

12 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

1 hour ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

3 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

3 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

3 hours ago