మొన్న శుక్రవారం విడుదలైన వాటిలో రక్షణ పేరుతో ఒక సినిమా ఉంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులైతే డిస్కషన్ అక్కర్లేదు కానీ అరెక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం వల్ల కొంత ఫోకస్ పడింది. కంటెంట్ కన్నా ఎక్కువ దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకూర్, హీరోయిన్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా కొన్ని రోజులు వార్తల్లో నిలిచింది. బాలన్స్ ఇవ్వలేదని పాయల్, ఇప్పుడు చెల్లిస్తాము ప్రమోషన్ కు రమ్మని ప్రొడ్యూసర్ ఒకరిమీద మరొకరు అభియోగాలు చేసుకుని చివరికి పబ్లిసిటీ లేకుండానే రిలీజ్ చేశారు. తీరా చూస్తే దీనికి కనీస స్పందన కరువై షోలు తగ్గిపోతున్నాయి.
అసలు బొమ్మలో ఏముందో చూద్దాం. ఎసిపి కిరణ్ (పాయల్ రాజ్ పుత్) ప్రాణ స్నేహితురాలు ప్రియా హఠాత్తుగా మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. మాస్కు వేసుకున్న ఒక వ్యక్తి ఇది చేశాడని భావించిన కిరణ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. కానీ ఆమె వల్లే అతను చనిపోతాడు. దీంతో సస్పెండ్ అవుతుంది. అయినా హత్యలు ఆగవు. దీని వెనుక ఒక సైకో కిల్లర్ ఉన్నాడని గుర్తించిన కిరణ్ ఆ దిశగా నిజాలు తవ్వుతూ వెళ్తుంది. ఆ తర్వాత హంతకుడు ఎవరనేది అసలు పాయింట్. గ్లామర్ షో, లిప్ లాక్ కిస్సులు లేకుండా చాలా సీరియస్ లేడీ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయింది.
సమస్యల్లా దర్శకుడు రణదీప్ టేకింగ్ తో వచ్చింది. స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా రాసుకోవడం ద్వారా ఎంగేజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ సాగదీసిన సన్నివేశాలు, అవసరం లేని ఎపిసోడ్లతో బోర్ కొట్టించేశాడు. పాటలు అడ్డం పడతాయి. రాక్షసుడు తరహా కథనాన్ని డిమాండ్ చేసే ఇలాంటి రక్షణలో అదే పూర్తిగా మిస్ అయ్యింది. దీంతో పాయల్, మానస్ వగైరా ఆర్టిస్టులు ఎంత బాగా నటించినా కంటెంట్ లో బలం లేకపోవడంతో సినిమాకు సరైన రక్షణ లేకుండా పోయింది. మొత్తానికి తిలా పాపం తలా పిడికెడు టైపులో ప్రమోషన్ చేయక, మూవీలో సరైన విషయం లేక పాయల్ ఖాతాలో ఇంకో ఫ్లాప్ పడింది.
This post was last modified on June 10, 2024 6:53 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…