సరిగ్గా ఇంకో 20 రోజుల్లో కల్కి 2898 ఏడి థియేటర్లలో ఉంటుంది. ట్రైలర్ జూన్ 10న చూసేయొచ్చు. బాహుబలి రేంజ్ హైప్ కనిపించడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ నిజానికి అసలైన కంటెంట్ రాబోయే రెండు వారాల్లో రాబోతోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రభుత్వం మారిపోయిన తరుణంలో నిర్మాత అశ్వినీదత్ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారట. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఇద్దరూ పరిశ్రమకు కావాల్సిన వ్యక్తులే కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్లు వచ్చేస్తాయి. ఇక జ్వరం సంగతి చూద్దాం.
విదేశాల్లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కేవలం ఒక్క రోజు నిడివిlo సుమారు 5 వేల టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇంకా మూడు వారాల టైం ఉన్న నేపథ్యంలో సులభంగా సలార్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఓవర్సీస్ బయ్యర్లు ధీమాగా చెబుతున్నారు.
ఇప్పటిదాకా 116 లొకేషన్లకు సంబంధించి బుకింగ్స్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. హాలీవుడ్ మూవీ క్వయిట్ ప్లేస్ కొత్త భాగం రిలీజ్ కూడా సమాంతరంగా ఉండటంతో భారీ సంఖ్యలో స్క్రీన్లు దక్కేందుకు ఇది అడ్డంకిగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 20 తర్వాత ఏ నిమిషమైనా ఆన్ లైన్ అమ్మకాలు షురూ అవుతాయి. ఫీవర్ చూస్తుంటే బుక్ మై షో, పేటిఎం లాంటి యాప్స్ నిమిషాల వ్యవధిలో క్రాష్ కావడం ఖాయంగా తోస్తోంది. అసలే ఫాంటసీ మూవీ. అందులోనూ ప్రభాస్ తో ఆరు వందల కోట్లతో నిర్మించిన గ్రాండియర్.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటించారు. హైప్ కి ఇంతకన్నా ఏం కావాలనేది ఫ్యాన్స్ మాట. ఇదంతా ఎలా ఉన్నా ప్రమోషన్ల వేగం పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా మూవీగా కల్కి బద్దలుకొట్టే రికార్డులు మాములుగా ఉండవు.
This post was last modified on June 7, 2024 8:28 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…