ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమానే అయినా మన్మథుడుకి ప్రేక్షకుల్లో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆ మధ్య రీ రిలీజ్ చేసినప్పుడు థియేటర్లు హౌస్ ఫుల్ చేసి ఎంజాయ్ చేశారు అభిమానులు. నాగార్జున యాక్టింగ్, త్రివిక్రమ్ రైటింగ్ ఎంతగా గుర్తుండిపోయిందో అంతే స్థాయిలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్షు పాత్ర కూడా మెమరీలో భద్రంగా ఉండిపోయింది. చనిపోయే పాత్రే అయినా క్యూట్ లుక్స్, చక్కని నటనతో ఆకట్టుకున్న తీరు ఎన్నిసార్లు చూసిన ఫ్రెష్ అనిపిస్తుంది. ప్రభాస్ తో రాఘవేంద్ర చేశాక అన్షు కనిపించకుండా వెళ్ళిపోయి విదేశాల్లో సెటిలైపోయింది.
కట్ చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత అన్షుతో రీ ఎంట్రీ ఇప్పిస్తున్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ లో ఈవిడను రావు రమేష్ ప్రియురాలిగా పునఃపరిచయం చేయబోతున్నారని తెలిసింది. అయితే ఏదో రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్టు తరహాలో కాకుండా అన్షు మీద ఓ రేంజ్ కామెడీ ప్లాన్ చేశారట. ముఖ్యంగా ఈ జంట మధ్య సన్నివేశాలు పేలిపోయేలా ఉంటాయని సమాచారం. లేటు వయసు లవ్ ట్రాక్స్ జాగ్రత్తగా డీల్ చేయాలి. తేడా రాకూడదు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట.
దీనికి మజాకా టైటిల్ ని దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. ధమాకా తరహాలో క్యాచీ సౌండ్ తో మాస్ వర్గాలను ఆకట్టుకునేలా పేరు పెట్టబోతున్నారు. ఊరిపేరు భైరవకోనతో సక్సెస్ ట్రాక్ లో పడ్డ సందీప్ కిషన్ దీంతో తిరిగి ఎంటర్ టైన్మెంట్ జానర్ లోకి వస్తానని నమ్మకంతో ఉన్నాడు. ఇదే కథను గతంలో చిరంజీవికి ప్లాన్ చేసుకుని ఆయన వద్దనుకోవడంతో ముఖ్యమైన మార్పులు చేసి రావు రమేష్ సందీప్ కిషన్ లకు తగ్గట్టుగా రాసుకున్నారు. అయినా లేటు వయసు అన్న మాటే కానీ మన్మథుడు రీ రిలీజ్ సందర్భంగా ఆమె ఇచ్చిన వీడియో బైట్ లో గ్లామర్ చూసి అందరూ షాక్ తిన్నారు.
This post was last modified on June 7, 2024 3:01 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…