Movie News

శర్వా కాజల్ సిక్సులు కొట్టాల్సిందే

ఫలితాల రూపంలో ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గిన తర్వాత వస్తున్న మొదటి శుక్రవారం ఈ రోజు. నిన్నటిదాకా ఐపీఎల్, ఎలక్షన్లు, ఎండలు అంటూ రకరకాల కారణాలు బాక్సాఫీస్ దగ్గర సందడి లేకుండా చేశాయి. యావరేజ్ టాక్ వచ్చినవి సైతం రెండు మూడు రోజులు హంగామా చేయడం తప్పించి పట్టుమని వారం రోజులు బలంగా వసూళ్లు రాబట్టినవి లేవు. అంచనాలు భారీగా మోసుకొచ్చిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సైతం ఇదే దారి పట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం పదకొండు సినిమాలు రిలీజ్ కావడం ఆసక్తి రేపుతున్నా వాటిలో అధిక దృష్టి మనమే, ఆపై సత్యభామ మీదే మాత్రమే ఉంది.

ముందుగా మనమే సంగతి చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పట్టున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినా సరే ఈసారి ఫలితం మీద రెట్టింపు నమ్మకంతో ఉన్నాడు. హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు ఖచ్చితంగా హిట్టు దక్కాల్సిన టైంలో వాళ్ళ కెరీర్ కి ఇది కీలక పరీక్ష కానుంది. ఇంకో వైపు రిలీజయ్యాక అందరూ హేశం అబ్దుల్ వహాబ్ పాటల గురించే మాట్లాడుకుంటారని టీమ్ పదే పదే చెప్పడం అంచనాలు పెంచుతోంది. పిల్లల సెలవులు పూర్తి కావొస్తున్న వేళ కుటుంబ ప్రేక్షకులు థియేటర్ ఆప్షన్ గా ముందు చూసేది మనమే.

ఇక కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సత్యభామ పేరుకి క్రైమ్ థ్రిల్లరే అయినా అన్ని వర్గాలు చూసే అంశాలు, సందేశాలు చాలా ఉన్నాయని టీమ్ చెబుతోంది. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చడం ఆసక్తిని పెంచుతోంది. సోలోగా కాజల్ ఎప్పుడూ చేయని ప్రయత్నమిది. అందుకే ప్రీమియర్లకు దగ్గరుండి వెళ్లి మరీ జనాల రియాక్షన్లు చూస్తోంది. ఈ రెండు కాకుండా రక్షణ, లవ్ మౌళి, ప్రేమించొద్దు, నమో అంటూ ఇంకొన్ని చిన్న సినిమాలున్నాయి కానీ అనూహ్యమైన టాక్ వస్తేనే వీటి వైపు పబ్లిక్ ఫోకస్ వెళ్తుంది. చూడాలి మరి టికెట్ కాంటర్లకు ఊపు ఎవరు తెస్తారో.

This post was last modified on June 7, 2024 8:38 am

Share

Recent Posts

కుటుంబాన్ని పోషించుకోలేక‌పోతున్నా.. ఐబొమ్మ ర‌వి ఆవేద‌న‌

ఐ బొమ్మ ర‌వి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమాల‌ను ఫాలో అయ్యే వాళ్లంద‌రికీ ఈ పేరు ప‌రిచ‌య‌మే.…

1 hour ago

తిరుమల వెళ్తున్నారా? ఇది మాత్రం మిస్ అవ్వకండి!

తిరుమ‌ల తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేవారికి శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం.. మొక్కులు చెల్లించుకోవ‌డం.. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీక‌రించ‌డం గొప్ప అనుభూతి. శ్రీవారిని…

5 hours ago

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

7 hours ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

7 hours ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

8 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

9 hours ago