ఇంకా అనౌన్స్ మెంట్ కూడా రాని మహేష్ బాబు దర్శకుడు రాజమౌళిల ప్యాన్ వరల్డ్ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందాని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే 31 కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని ఎదురు చూశారు కానీ రాజకీయ వాతావరణంతో పాటు వర్క్ షాప్, క్యాస్టింగ్ కు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో అదేమీ జరగలేదు. ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. దుర్గా ఆర్ట్స్ ప్రధాన నిర్మాణ సంస్థ అయినప్పటికీ ఇతర భాగస్వాములకు సంబంధించిన నిర్ణయాలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. దీనికి టైం పట్టేలా ఉంది.
ఇదంతా పక్కనపెడితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ ఆ మధ్య గట్టిగానే ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో ప్రధానమైంది మహారాజా. అభిమానులకు కూడా కనెక్ట్ అయిపోయింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కౌ బాయ్ తరహాలో మహేష్ పోషించే పాత్రకు ఇది నప్పుతుందా అనే అనుమానాలు జనంలో లేకపోలేదు. కానీ జక్కన్న టీమ్ నుంచి దీన్ని ఖండిస్తూ లేదా సమర్థిస్తూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదెలా ఉన్నా ఇదే పేరుతో విజయ్ సేతుపతి జూన్ 14న వచ్చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ మహారాజా ఒకేసారి విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఉప్పెన విలన్ గా ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి సినిమాలు తర్వాత చాలానే డబ్బింగ్ అయ్యాయి కానీ ఏ ఒక్కటి కనీస స్థాయిలో ఆడలేదు. కోలీవుడ్ లో కరుడు గట్టిన విమర్శకులతో చప్పట్లు కొట్టించుకున్న సూపర్ డీలక్స్ మన దగ్గర అడిగిన పాపాన పోలేదు. కానీ మహారాజాలో కంటెంట్ కనిపిస్తోంది. సెలూన్ నడుపుకునే నాయి బ్రాహ్మణుడిగా అతని పాత్ర చాలా డిఫరెంట్ గా వయొలెంట్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చాడు. సుధీర్ బాబు హరోం హరకు ధీటైన పోటీ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on June 6, 2024 9:49 pm
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…