కొన్నిసార్లు సినిమాలను మించిన భావోద్వేగాలను తారలకు సంబంధించిన నిజ జీవితం వీడియోలు ఇస్తాయి. అలాంటిదే ఇవాళ మెగా ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు. జనసేన పార్టీని రికార్డు స్థాయిలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించుకోవడమే కాక తాను కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే ఘనతను అందుకున్న పవన్ కళ్యాణ్ ఫలితాలు వచ్చిన మూడో రోజునే అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం కోసం భార్య అన్నా, కొడుకు అకీరాతో కలిసి విచ్చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తిరగేస్తోంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి.
పవన్ కారు దిగగానే రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితర మెగా యూత్ హీరోలు స్వాగతం చెప్పడం, తల్లి అంజనా దేవి, వదిన సురేఖ హారతులు ఇచ్చి లోపలి తీసుకెళ్లగా ఎదురు చూస్తున్న చిరంజీవి కాళ్లకు పవన్ వెంటనే పాద నమస్కారం చేయడం చూడ ముచ్చటగా ఉంది. తల్లిలా భావించే సురేఖని దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా పవన్ చూపించిన అభిమానం ఆవిడ మీద గౌరవం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేసింది. తర్వాత కేకు కట్ చేసి, కేకలు ఈలలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. ఇప్పుడు అరవండి అంటూ చిరంజీవి స్వయానా ఒక అభిమానిలా పిలుపు ఇవ్వడం నెక్స్ట్ లెవెల్.
అసలే రెండు రోజుల నుంచి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మెగా ఫాన్స్ కి ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ కానుకని చెప్పాలి. చిరు, పవన్ లు కలుసుకుంటారని ముందే ఊహించినా అదేదో మాములుగా విశ్వంభర సెట్ లా చిన్నగా ఉంటుందనుకుంటే ఏకంగా కుటుంబం మొత్తం దాన్నో సంబరంలా జరుపుకోవడం చిన్న విషయం కాదు. ప్రజారాజ్యం తర్వాత రాజకీయంగా ఉనికిని కోల్పోయిన మెగా ఫ్యామిలీకి తిరిగి వైభవం తీసుకొచ్చిన వాడిగా పవన్ కళ్యాణ్ దీనికి మించిన అర్హుడే. ఈ వీడియోని షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న ముచ్చట్లకు ట్విట్టర్ ఎక్స్ కాస్తా వేదికగా మారిపోయింది.
This post was last modified on June 6, 2024 9:50 pm
యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…