Movie News

దర్శకుడి ఎంపికలో రామ్ తెలివైన నిర్ణయం

ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ బ్యాలన్స్ షూటింగ్ కోసం ముంబైలో బిజీగా ఉన్న రామ్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా తొలగలేదు. నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే ఒక భారీ వెబ్ సిరీస్ కోసం పలువురు దర్శకులు కలిశారు కానీ ఇంకా ఏదీ కొలిక్కి రాలేదని సమాచారం. హరీష్ శంకర్ తో ఒక ప్రాజెక్టు అనుకున్నప్పటికీ ప్రస్తుతం తను మిస్టర్ బచ్చన్, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీ అయిపోయాడు. ఆ రెండు అయ్యాక చిరంజీవితో చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. సో రామ్ తో కలయికకు కొంత టైం పట్టేలా ఉంది. ఈలోగా ఇంకో క్రేజీ కాంబో లాకయ్యింది.

గత ఏడాది మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టితో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో మైత్రి మూవీ మేకర్స్రామ్ హీరోగా నిర్మించబోయే సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలయికలో ఇతను రూపొందించిన సెన్సిబుల్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు, వసూళ్లు రెండూ దక్కించుకుంది. సున్నితమైన వీర్య దానం పాయింట్ ని చాలా కన్విన్సింగ్ గా చెప్పిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఈసారి కూడా వినోదాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఆ యాంగిల్ నచ్చే రామ్ ఒప్పుకున్నట్టు అంతర్గత సమాచారం.

మాస్ ట్రాప్ లో పడ్డ రామ్ ని ఒక లవర్ బాయ్ తరహా రొమాంటిక్ రోల్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా అన్ని కమర్షియల్ మీటర్ లో చేసినవి కావడంతో కామెడీ, ఫన్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు మహేష్ బాబు కథలో ఇవే ప్రధానాంశంగా ఉండబోతున్నాయి. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ విడుదల ఎప్పుడనేది ఇంకా తేలలేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ మొత్తం షూట్ అయ్యాక డేట్ డిసైడ్ చేయబోతున్నాడు. ఇంకో నెల రోజుల్లో గుమ్మడికాయ కొట్టొచ్చని టాక్.

This post was last modified on June 6, 2024 3:48 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

21 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

41 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago