డాన్స్ డైరెక్టర్ గా ఉన్న లారెన్స్ రాఘవేంద్రని దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాలు ముని, కాంచన. హారర్ లో కూడా విపరీతంగా నవ్వించవచ్చనే కాన్సెప్ట్ ఈయన తీసుకొచ్చిందే. అప్పటిదాకా సీరియస్ కథలకు కట్టుబడిన రచయితలు క్రమంగా ఆత్మలను సిల్లీగా చూపించడం మొదలుపెట్టారు. విజయాలు కూడా దక్కాయి. తర్వాత కాంచన 2, కాంచన 3 లు సైతం బాగానే సక్సెస్ అయ్యాయి. ఒకే సబ్జెక్టుని తిప్పి తిప్పి తీస్తాడనే నెగటివ్ కామెంట్స్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర బయ్యర్లకు లాభాలు ఇచ్చినవే. పి వాసుతో చేసిన చంద్రముఖి 2 ఒకటే దారుణంగా పోయింది.
సరే ట్రెండ్ తగ్గిందని లారెన్స్ ఊరుకోవడం లేదు. కాంచన 4కి శ్రీకారం చుట్టబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి స్వీయ దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెడతానని అధికారికంగా ప్రకటించాడు. తన డైరెక్షన్ లో వచ్చిన చివరి చిత్రం కాంచన హిందీ రీమేక్ లక్ష్మి. అక్షయ్ కుమార్ తో తీసిన ఈ సినిమా నేరుగా ఓటిటి స్ట్రీమింగ్ జరుపుకున్నప్పటికీ దారుణమైన విమర్శలకు గురయ్యింది. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న లారెన్స్ పూర్తిగా నటనకు పరిమితమయ్యాడు.తిరిగి ఇంత కాలం తర్వాత మెగా ఫోన్ చేపట్టాడు. కాంచన 4 కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో బహు భాషల్లో రానుంది.
ఇదంతా బాగానే ఉంది కానీ లారెన్స్ ఇంకా కాంచనను పట్టుకుని వదలకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. టేకింగ్ పరంగా మంచి టాలెంట్ ఉన్నప్పుడు కొత్త జానర్లు ట్రై చేయాలి. యాక్టర్ గా కొత్త సవాళ్ళను స్వీకరించాలి. అంతే తప్ప ఆల్రెడీ అరిగిపోయిన దెయ్యాల కథలు, దివ్యంగుల బ్యాక్ డ్రాప్ లో పాత ఫ్లాష్ బ్యాక్ లు ఇప్పటికే బోర్ కొట్టేశాయి. అయినా సరే లారెన్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. గత ఏడాది హీరోగా జిగర్ తండా డబుల్ ఎక్స్ రూపంలో తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నృత్య దర్శకుడు దాని తెలుగు డబ్బింగ్ తో మాత్రం నిరాశ కలిగించే ఫలితం దక్కించుకున్నాడు.
This post was last modified on June 6, 2024 12:05 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…