మాములుగా సినిమాలు, ఆధ్యాత్మికత తప్ప రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని హీరో వెంకటేష్. గతంలో తండ్రి రామానాయుడు గారు ఈ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా సురేష్ బాబుతో సహా అన్నదమ్ములిద్దరూ దీనికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే వెంకీ మామ ఈసారి మినహాయింపు ఇచ్చారు. తనకు కావాల్సిన వాళ్ళ కోసం స్వయంగా ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రత్యక్షంగా క్యాంపైన్స్ లో పాల్గొన్నారు. ఆయన లక్కీ హ్యాండ్ పని చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెంకటేష్ ఎవరికోసమైతే పని చేశారో ఆ ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం విశేషమేగా.
వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కోసం వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయమని పబ్లిక్ ని అభ్యర్థించారు. కూతురు ఆశ్రితను వాళ్ళబాయికి చేసుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘురాంరెడ్డి రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. ఏపీలో కూటమి తరఫున నిలబడిన బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కోసం వెంకటేష్ కైకలూరు వచ్చారు. జన స్పందన విశేషంగా వచ్చింది. కట్ చేస్తే 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు. కలియుగ పాండవులు తర్వాత వెంకటేష్ కు పెళ్లి సంబంధం కుదిర్చింది ఈ శ్రీనివాసే.
ఏదైతేనేం దగ్గుబాటి కుటుంబానికి అత్యంత సన్నిహితులు గెలుపు సాధించడం వెంకీ ఫ్యామిలీలో సంతోషాన్ని తీసుకొచ్చింది. తాజా రాజకీయ పరిణామాలు వెంకటేష్ కి ఆనందం కలిగించేవే. ఆప్త మిత్రుడు, గోపాల గోపాల కో స్టార్ పవన్ కళ్యాణ్ వంద శాతం గెలుపు సాధించగా చంద్రబాబునాయుడు సీఎం పీఠం దక్కించుకోవడం రెండూ జరిగాయి. రానా నాయుడు వెబ్ సిరీస్ రెండో సీజన్ షూటింగ్ కోసం ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్న వెంకటేష్ అది పూర్తి కాగానే దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ మూవీ సెట్లో అడుగు పెడతారు.
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…