ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో అంచనాల పరంగా శర్వానంద్ మనమే అగ్రస్థానంలో ఉన్నప్పటికి తమ కంటెంట్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమా పోటీలో ఉన్న ఇతర చిత్రాల్లో కనిపిస్తోంది. వాటిలో రెండు ఒకే విషయంలో కాకతాళీయంగా ఒకటేలా అనిపించడం విశేషం. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన సత్యభామకు ఏ రేంజ్ లో ప్రమోషన్లు జరుగుతున్నాయో చూస్తున్నాం. ట్రైలర్ అంచనాలు తీసుకురాగా బాలయ్య ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ఆడియన్స్ దృష్టిలో పడింది. శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చగా సుమన చిక్కాల దర్శకత్వం వహించారు.
మొదటిసారి కాజల్ అగర్వాల్ ఇందులో ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఇంకోవైపు పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన రక్షణ కూడా అదే రోజు వస్తోంది. ఇది కూడా క్రైమ్ థ్రిల్లరే. నాలుగేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ మోక్షం దక్కించుకోవడంలో ఆలస్యం జరిగింది. దీని మీదే నిర్మాత, పాయల్ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఏ మేరకు సద్దుమణిగిందో కానీ మొత్తానికి జూన్ 7న థియేటర్లలో వదిలేందుకు సిద్ధమయ్యారు. కొంత గ్యాప్ తర్వాత మంగళవారం పాయల్ కు మంచి పేరు తీసుకొచ్చింది.
సో గ్లామర్ తో అలరించిన అందగత్తెలు ఇప్పుడు ఖాకీ దుస్తులు వేసుకుని ఎలా మెప్పిస్తారో చూడాలి. కాంపిటీషన్ అయితే బాగానే ఉంది కానీ మనమే, లవ్ మౌళిలతో తలపడటం అంత సులభంగా ఉండదు. కాకపోతే ఎన్నికల ఫలితాలు వెలువడి జనాలు మాములు మూడ్ లోకి వచ్చేసి ఉంటారు కాబట్టి శుక్రవారం థియేటర్లకు ఎవరు ఎక్కువ రప్పిస్తారనేది కీలకం కానుంది. జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కు మునుపటి రోజులు వచ్చేస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తున్న టైంలో వస్తున్న మొదటి బంచ్ సినిమాలివి. ఎవరి అలరిస్తాయో ఏవి చేతులు ఎత్తేస్తాయో ఈ శుక్రవారం తేలిపోతుంది.
This post was last modified on June 3, 2024 5:07 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…