ఒకప్పుడు ఓ చిత్రంలో ఒక లిప్ లాక్ ఉంటేనే దాని గురించి తెగ మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు రీజనల్ సినిమాల్లో కూడా బోలెడన్ని ముద్దు సీన్లు ఉంటున్నాయి. ఇంటిమేట్ సీన్లనేవి కూడా కామన్ అయిపోయాయి. ఓటీటీల పుణ్యమా అని లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లకు అందరూ అలవాటు పడిపోయారు. ఫ్యామిలీ సినిమాలు అనుకున్న వాటిలోనూ ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు చూస్తున్నాం.
ఇలాంటి టైంలో ఇప్పుడు ఒకే సినిమాలో 42 ఘాటు ముద్దు సీన్లు పెట్టేయడం హాట్ టాపిక్‌గా మారింది. నవదీప్ ప్రధాన పాత్ర పోషించిన ‘లవ్ మౌళి’లో హీరో హీరోయిన్లు ముద్దుల మోత మోగించేయబోతున్నారట. ఇందులో ఏకంగా 42 ఘాటు ముద్దులు ఉన్నట్లు చిత్ర బృందమే వెల్లడించడం విశేషం. యూత్ ఈ సినిమా కోసం ఎగబడ్డానికి ఇంతకంటే కారణం అవసరం లేదు.
‘లవ్ మౌళి’ ప్రోమోలన్నింటిలోనూ లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లే హైలైట్ అయ్యాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా హాట్ సీన్లు తక్కువగా ఏమీ లేవు. ‘‘నీకు ఇంకా ఓపిక ఉందా’’ అని హీరో అడగడం.. మూడుసార్లు అయింది, ఇంకోసారి చేసి రికార్డ్ బ్రేక్ చేద్దాం అని హీరోయిన్ ఫోర్స్ చేయడం.. అలా చేస్తే బ్రేక్ అయ్యేది రికార్డులు కాదు, బాడీలో పార్ట్స్ అని హీరో అనడం.. ఇలా ఈ సంభాషణ చూస్తేనే సినిమాలో ఎంత హైడోస్ రొమాన్స్ ఉంటుందో అర్థమైపోతుంది.
ఈ చిత్రానికి విశాఖపట్నంలో ఈ రోజే స్పెషల్ ప్రిమియర్ షో కూడా వేస్తున్నారు. ఆ షో సోల్డ్ ఔట్ అయిపోవడం విశేషం. ఈ శుక్రవారం మనమే, సత్యభామ చిత్రాలతో పోటీ పడుతోంది ‘లవ్ మౌళి’. సోలో హీరోగా నవదీప్ ఎప్పుడు హిట్ కొట్టాడో కూడా జనానికి గుర్తు లేదు. ఈ మధ్య అలాంటి సినిమాలే చేయట్లేదు. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన ఈ చిత్రంపై నవదీప్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.
This post was last modified on June 3, 2024 4:58 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…