ఒక సినిమా కాస్త హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. సినిమా ఫలితం చూడకుండానే పార్ట్-2, లేదా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. వాటిలో కొన్ని కార్యరూపం దాలుస్తున్నాయి. కొన్ని అటకెక్కేస్తున్నాయి. ఐతే ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడం విశేషం. ఆ చిత్రమే.. ఇండియన్/భారతీయుడు.
ఒక హిట్ మూవీకి సీక్వెల్ మరీ ఇంత విరామం తర్వాత రావడం అరుదు. ఐతే ఇందులో తన ఆలస్యం ఏమీ లేదని.. శంకర్‌దే అని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘భారతీయుడు’కు సీక్వెల్ చేద్దామని తానే ముందు ప్రతిపాదించానని.. అది కూడా ‘భారతీయుడు’ పెద్ద హిట్టయిన తర్వాతి రోజుల్లోనే శంకర్‌కు ఆ మాట చెప్పానని.. కానీ ఆయన దగ్గర అప్పటికి కథ లేక సాధ్యపడలేదని కమల్ వెల్లడించాడు.
ఇక ‘భారతీయుడు’ తెర వెనుక కథ గురించి కమల్ వెల్లడిస్తూ.. తాను 90వ దశకంలో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్‌తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యానని.. ఆ సమయంలోనే శంకర్ తనకు ‘భారతీయుడు’ కథ చెప్పాడని.. ఐతే రెండు కథలూ ఒకేలా ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదని.. అప్పుడు శివాజీ గణేశనే చొరవ తీసుకుని.. “మనిద్దరం కలిసి వేరే సినిమాలు చేశాం కదా, ఈ కథ బాగుంది, నువ్వు భారతీయుడు సినిమానే చెయ్యి” అని తనకు చెప్పారని.. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే తాము ‘భారతీయుడు’ సినిమా తీశామని కమల్ చెన్నైలో జరిగిన ‘భారతీయుడు-2’ ఆడియో వేడుకలో తెలిపాడు.
ఇక శంకర్ మాట్లాడుతూ.. కమల్ లాంటి నటుడు ప్రపంచంలోనే లేడని.. ఆయన 360 డిగ్రీలకు మించి నటించగలడని.. ‘భారతీయుడు’ను మించి ‘భారతీయుడు-2’; ‘భారతీయుడు-3’ విజయవంతం అవుతాయని అన్నాడు.
This post was last modified on June 3, 2024 4:30 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…