పిఠాపురం.. కొన్ని వారాలుగా ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంచుకున్న నియోజకవర్గం కావడమే అందుక్కారణం. ఆ మేరకు ప్రకటన వచ్చిన తొలి రోజు నుంచి పిఠాపురం పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతూ వస్తోంది. అక్కడ పవన్ ప్రచారానికి వెళ్లిన ప్రతిసారీ జనం బ్రహ్మరథం పట్టారు. ఆ నియోజకవర్గం నుంచి పవన్ భారీ మెజారిటీతో గెలవబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పవన్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎన్నికైతే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని అంచనా వేస్తున్నారు. తొలిసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి పవన్ చేయాల్సిందల్లా చేస్తారనడంలో సందేహం లేదు.
ఐతే ఇంకా ఫలితాల ప్రకటన రాకముందే పిఠాపురానికి హైప్ క్రియేట్ అయి.. అక్కడ ఓ పేరున్న సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రమే.. మనమే. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాను నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పవన్‌కు సన్నిహితుడు. ఇక ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నారని.. ఎన్నికల ఫలితాలు రాగానే తర్వాతి రోజే అక్కడ ఈవెంట్ చేస్తే మంచి హైప్ కూడా వస్తుందని.. ఇందుకోసం అనుమతులు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ క్రేజీ రూమర్లలో వాస్తవమెంతో చూడాలి.
This post was last modified on June 2, 2024 2:58 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…