ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాలో మహా అయితే అయిదారు పాటలు ఉండటమే మహా కష్టంగా మారిపోతోంది. వాటిని షూట్ చేయడంలో ఉన్న రిస్క్ ఒక కారణమైతే అన్ని సాంగ్స్ బెస్ట్ ఇచ్చే సంగీత దర్శకులు కరువ్వడం మరో రీజన్. అందుకే ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా సరే నాలుగైదు పాటలలోపే పరిమితులు విధించుకుంటున్నాయి. ఒకప్పుడు ఇలా లేదు. ఉదాహరణకు రాఘవేంద్రరావు దృశ్యకావ్యాలు అన్నమయ్య – పెళ్లి సందడిలో డజను పైగా పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. బాలీవుడ్ క్లాసిక్ హం ఆప్కె హై కౌన్ లో ఏకంగా 14 పాటలు ఉంటాయి. అన్నీ ఛార్ట్ బస్టర్సే.
సరే వర్తమానానికి వస్తే జూన్ 7 విడుదల కాబోతున్న శర్వానంద్ మనమేలో ఏకంగా 16 పాటలు ఉంటాయని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. చైల్డ్ కామెడీ ప్లస్ సెంటిమెంట్ మీద నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఇంత పెద్ద ఆల్బమ్ అంటే ఖచ్చితంగా షాకే.
మ్యూజిక్ సెన్సేషన్ గా మారుతున్న హేశం అబ్దుల్ వహాబ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ వర్క్ అవుతుందని, రీ రికార్డింగ్ కూడా అంతే బెస్ట్ ఇచ్చాడని కితాబు ఇవ్వడం చూస్తే సంగీత ప్రియులకు పండగే అనుకోవచ్చు. అయితే అన్ని పాటలు ఒకే లెన్త్ లో ఉండకపోయినా ట్యూన్లు ఖచ్చితంగా వేరే ఉంటాయి.
ఇది సక్సెస్ అయితే కనక ఎక్కువ పాటలు ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారని అర్థమైపోతుంది కాబట్టి మిగిలిన దర్శకులూ అనుసరించే ఛాన్స్ ఉంటుంది. ఖుషి నుంచి తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హేశంకి మనమే మంచి ప్రమోషన్ అయ్యేలా ఉంది.
ఒకే ఒక జీవితం తర్వాత రెండేళ్ల గ్యాప్ వచ్చేసిన శర్వానంద్ ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గొడవలు పడి మరీ బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకొచ్చామని, బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పేశాడు. హీరోయిన్ కృతి శెట్టికి సైతం మనమే సక్సెస్ కీలకం కానుంది. రిలీజ్ కు ఇంకో ఆరు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ ని పెంచబోతున్నారు.
This post was last modified on June 1, 2024 3:11 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…