Movie News

ఫ్యామిలీ స్టార్…..భలే చెప్పారు సార్

ఎంతైనా సీనియర్లు సీనియర్లే. వాళ్ళ అనుభవం, నిశిత పరిశీలన సరిగ్గా వాడుకోవడమో లేదా ఆ తరహాలో ఆలోచించడం ద్వారానో ఇప్పటి దర్శకులు మంచి ఫలితాలు అందుకోవచ్చు.

సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ లో పాఠాలు పేరుతో నవతరానికి ఫిలిం మేకింగ్, రైటింగ్ మీద చక్కని వీడియోలు పెడుతుంటారు.

తాను థియేటర్లకు వెళ్లి చూడలేని సినిమాలను ఓటిటిలో చూసి రివ్యూ రూపంలో వాటి ప్లస్సు మైనస్సులను బహిర్గత పరుస్తారు. అందులో భాగంగానే ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ చూసి తనదైన శైలిలో ఫెయిల్యూర్ కి గల కారణాలను స్పష్టంగా వివరించారు.

సెకండాఫ్ లో హీరోయిన్ హీరోకి సహాయం చేస్తూ పోవడం వల్ల ఆమెదే పైచేయి అయ్యిందని, అంతే కాక ఈగోతో మృణాల్ కి విజయ్ దేవరకొండ దూరం కావడం ప్రేక్షకులకు ఎంత మాత్రం కనెక్ట్ కాని పాయింటని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ అపార్థంతో విడిపోతే అంగీకరింపు ఎక్కువగా ఉంటుందని, కానీ ఫ్యామిలీ స్టార్ లో ఇది అసంబద్ధంగా సాగిందని అన్నారు.

పైగా మాస్ హీరోతో చేయించినట్టు విజయ్ తో పెద్ద ఫైట్లు పెట్టడం, ఎవరినైనా మట్టి కరిపిస్తాడనే రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం యూత్ కి నచ్చ లేదని విశ్లేషించారు. మూడు కథలను ఒకే దాంట్లో ఇరికించే ప్రయత్నం చేయడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని అన్నారు.

ఇది కాకుండా కోమాలోకి వెళ్ళిపోయిన విలన్ కొడుకుని తీసుకొచ్చి హీరోయిన్ కి పెళ్లి చేయాలనుకోవడమే రెండో సగంలో జరిగిన అతి పెద్ద తప్పుగా పేర్కొన్నారు. కనీసం పావు గంట తీసేసి ఉంటే మెరుగైన ఫలితం దక్కేదని అన్నారు.

ఇది ముమ్మాటికీ విజయ్ దేవరకొండ సరిపోయే కథని, కాకపోతే యూత్ లో అతని ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఎపిసోడ్లు రాసుకుంటే బాగుంటుంది కానీ సూపర్ హీరోగా చూపించే ప్రయత్నం చేయకూడదని అన్నారు. పరశురామ్ మీద కొన్ని ప్రశంసలు గుప్పించారు. ఏమైనా పరుచూరి చెప్పినవి చాలా మంచి పాయింట్స్. స్క్రిప్ట్ రూపకల్పనలోనే ఇలాంటివి పసిగడితే సమస్యలు తగ్గించుకోవచ్చు.

This post was last modified on June 1, 2024 1:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

50 వార్షికోత్సవ వేళ వైజయంతి ప్లాన్ ఏంటి

కల్కి 2898 ఏడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపన ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాల మైలురాయి…

35 mins ago

‘కల్కి’లో దీపికకు వాయిస్ ఎవరిచ్చారు?

‘కల్కి’ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో దీపిక పదుకొనేది ఒకటి. ఈ సినిమా కథంతా ఆమె చేసిన సుమతి…

2 hours ago

‘కల్కి’లో ఆ అబ్బాయి పాత్రపై ట్విస్ట్

ప్రపంచ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా పేరు మార్మోగేలా చేస్తున్న చిత్రం.. కల్కి. గత గురువారం రిలీజైన ఈ చిత్రంలో…

3 hours ago

సాఫ్ట్ కుర్రాడిలో ఇంత మాసేంటి సామీ

https://www.youtube.com/watch?v=w4yDAjVtHr8 యూత్ హీరో రాజ్ తరుణ్ సోలోగా హిట్టు కొట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. నాగార్జున నా సామిరంగ సక్సెసైనప్పటికీ…

4 hours ago

ఇరికించబోయి ఇరుక్కున్న వైసీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ అనే అభిప్రాయం ఉంది సోషల్ మీడియాలో. 2019లో ఆ…

5 hours ago

టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ సర్కార్ తెలివైన మెలిక

పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల…

6 hours ago