కమెడియన్లుగా మంచి పేరు సంపాదించిన చాలా మంది తర్వాత హీరోలయ్యారు. ఈ జాబితాలోకి ఇటీవలే వెన్నెల కిషోర్ కూడా చేరాడు. ‘చారి 111’ అనే సినిమాతో అతను హీరో అయ్యాడు. ఇదొక కామెడీ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ. ‘చంటబ్బాయి’ స్టైల్లో ఏదో ట్రై చేశారు కానీ.. పెద్దగా వర్కవుట్ కాలేదు. థియేటర్లలో ఈ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియకుండా పోయింది.
ఐతే ఈ చిత్రం ‘అమేజాన్ ప్రైమ్’ ద్వారా డిజిటల్ రిలీజ్ అయ్యాక మంచి స్పందన తెచ్చుకుంది. ప్రైమ్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇది చూసే కిషోర్‌లో ఉత్సాహం వచ్చినట్లుంది. మళ్లీ అతను హీరోగా నటిస్తున్నాడు. అంతే కాక తొలి చిత్రం ‘చారి 111’ తరహాలోనే మళ్లీ కామెడీ డిటెక్టివ్ కథతోనే కిషోర్ హీరోగా రెండో సినిమా చేస్తుండడం విశేషం.
వెన్నెల కిషోర్ డిటెకివ్ పాత్ర చేస్తున్న కొత్త సినిమా పేరు.. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ రోజే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిన్న పిట్టకథ రూపంలో ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ ఇంట్రో కూడా ఇచ్చారు. “కథలు వెతలాయె కథనాలు ఏడాయె.. మొన్న సచ్చిన కుందేలు నిన్న కూరాయె… దాని చంపినోడు సచ్చి ఆరు నెల్లాయె.. ఈ చిక్కుముడి విప్పినోడు..” అని బ్రేక్ ఇస్తే ఒక పిల్లాడు ఆ విప్పినోడు అని అడుగుతాడు.
దానికి బదులుగా నరేటర్.. ‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్సాయె’’ అంటాడు. ఇలా ఫన్నీ నరేషన్‌తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ను పరిచయం చేశారు. వెన్నెల కిషోర్ గెటప్ ఫన్నీగా అనిపిస్తోంది. ఇందులో కిషోెర్ సరసన అనన్య నాగళ్ల కథానాయికగా చేస్తోంది. రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెన్నపూస రమణారెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on May 30, 2024 6:49 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…