పుష్ప 2 ది రైజ్ నుంచి రెండో లిరికల్ వీడియో ఇవాళ చెప్పిన టైంకి ఆలస్యం చేయకుండా విడుదల చేశారు. పుష్ప 1 ది రూల్ లో ఛార్ట్ బస్టర్ గా నిలిచిన సామీ నా సామీకి ఎక్స్ టెన్షన్ లా ఉంటుందని టీమ్ ముందే చిన్న టీజర్ రూపంలో క్లూ ఇవ్వడంతో దానికి తగ్గట్టే అంచనాలు పెట్టుకున్నారు సంగీత ప్రియులు. ఆశ్చర్యకరంగా ఇది మొదటి దానికన్నా బెటర్ గా, వినేకొద్దీ అర్థమవుతోందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ గీత రచనలో, గానంతో మరోలోకంలోకి తీసుకెళ్లే శ్రేయ ఘోషల్ గాత్రం అందించగా ట్యూన్ చాలా క్యాచీగా ఉంది.
దేవిశ్రీ ప్రసాద్ ఇన్స్ ట్రుమెంటేషన్ ప్రతిసారి కొత్తగా ఉండదు. కానీ ట్యూన్ వినేకొద్దీ ఎక్కేస్తుంది. దానికి మంచి సాహిత్యం పడాలి అంతే. ఈ రెండూ సూసెకి అగ్గిరవ్వలాగా ఉంటాడే నా సామీ బాగా కుదిరాయి. పుష్పరాజ్ వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూనే భార్య దగ్గర అతను ఎలా ఒక మాములు భర్తలా మారిపోయాడనే రీతిలో సాగే పదాల గారడీ బాగుంది. ఊరందరికీ పంచిపెట్టేవాడు చొక్కాను మాత్రం నన్నే అడుగుతాడంటూ, మొరటోడని ఎందరు అనుకున్నా మనసులో ఉన్న వెన్న తనకే తెలుసంటూ వర్ణించిన తీరులో చాలా అర్థముంది. దానికి తోడు శ్రేయ గాత్రం పాటని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది.
ఇప్పుడున్న ట్రెండ్ లో వాయిద్యాల హోరులో లిరిక్స్ వినిపించడం కష్టమైపోయింది. అలా చూసుకుంటే ఈ సాంగ్ లో ఉన్న ఫీల్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. లిరికల్ వీడియోలో తెలివిగా ఒరిజినల్ షూట్ చేసిన విజువల్స్ కాకుండా రిహార్సల్ టైంలో మాములు కాస్ట్యూమ్స్ లో ఉన్నప్పుడు తీసిన ఫుటేజ్ తో వెరైటీగా కట్ చేయడం బాగుంది. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, దర్శకుడు సుకుమార్, పదుల సంఖ్యలో డాన్సర్లు, సందడిగా ఉండే సెట్ వాతావరణం, ప్రాక్టీస్ చేస్తున్న అల్లు అర్జున్ రష్మిక మందన్న జోడి మొత్తం కనులవిందుగా ఉంది. సో మొత్తంగా దేవి మేజిక్ మళ్ళీ పని చేసినట్టే ఉంది.
This post was last modified on May 29, 2024 12:01 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…