Movie News

దీపికా పదుకునే కేరాఫ్ నాలుగు వేల కోట్లు

అన్ని భాషల్లో కలుపుకుని టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే కొన్ని క్షణాలు ఆలోచించాలేమో కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ముక్త కంఠంతో దీపికా పదుకునే పేరు చెబుతున్నారు. ఎందుకంటే కేవలం నాలుగు సినిమాలతో నాలుగు వేల కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశం అందరికీ దక్కదుగా. దీపికా గత మూడు చిత్రాలు పఠాన్, జవాన్, ఫైటర్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 2550 కోట్లకి పైగా గ్రాస్ సాధించాయి. వచ్చే నెల 27 విడుదల కాబోయే కల్కి 2898 ఏడి టాక్ తో సంబంధం లేకుండా ఎంత లేదన్నా కనిష్టంగా పదిహేను వందల కోట్లు వసూలు చేయడం ఖాయం కాబట్టి టోటల్ ఫిగర్ షాకింగే.

ఇంత అరుదైన ఘనత బాలీవుడ్ లోనే కాదు ఇటు సౌత్ లోనూ ఎవరికీ దక్కలేదు. నిజానికి పఠాన్ కు ముందు దీపికా పదుకునే ఫ్లాపుల్లో ఉంది. గెహరాయి, చెపాక్, జీరో ఇలా వరసగా ఏడాదికో డిజాస్టర్ నమోదయ్యింది. భర్త రణ్వీర్ సింగ్ సర్కస్ లో క్యామియో చేస్తే అది కూడా దారుణంగా బోల్తా కొట్టింది. 83 ఒకటే రిలీఫ్ ఇచ్చింది కానీ అది వరల్డ్ కప్ బయోపిక్ కావడంతో ఆశించినంత ఎక్కువ పేరు రాలేదు. ఇంకోవైపు నిర్మాతగానూ మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇదేంటి ఐరన్ లెగ్ గా మారుతుందనుకుంటున్న టైంలో పఠాన్ నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇప్పుడు కల్కితో ఇవ్వబోతున్న టాలీవుడ్ ఎంట్రీ మరో మేజర్ బ్రేక్ కానుంది. అజయ్ దేవగన్ తో చేస్తున్న సింగం అగైన్ సైతం వేయి కోట్ల సత్తా ఉన్న ఫ్రాంచైజ్. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా డెలివరీకి ముందు అన్ని కమిట్ మెంట్లు పూర్తి చేసి కొంత బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉంది. ఎప్పుడనేది రణ్వీర్ దంపతులు వెల్లడించడం లేదు కానీ ఈ ఏడాది దసరాలోపే ఉండచ్చు. ఈ కారణంగానే కల్కి ప్రమోషన్లకు దాదాపు రాకపోవచ్చని అంటున్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ ఫ్లైట్ లాంటిది ఏర్పాటు చేసే తీసుకొచ్చే ఆలోచనలో వైజయంతి బృందం ఉన్నట్టు తెలిసింది. చూడాలి.

This post was last modified on May 28, 2024 7:14 pm

Share
Show comments

Recent Posts

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

48 minutes ago

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

7 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

8 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

9 hours ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

11 hours ago