నిన్న సాయంత్రం నిర్వహించిన గంగం గణేశా ఈవెంట్ లో ఆ సినిమా కంటెంట్ కన్నా మరో విషయం విపరీతంగా హైలైట్ అయ్యింది. ప్రత్యేక అతిథిగా రష్మిక మందన్న విచ్చేయగా తనతో ఆనంద్ దేవరకొండ చేసిన సరదా ఇంటర్వ్యూ కొన్ని సంగతులకు అధికారిక ముద్ర వేసినట్టు అయ్యింది. ముఖ్యంగా నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరని ఎదురైన ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ నా ఫ్యామిలీ అయ్యుండి ఇలా ట్రిక్ చేస్తావా అంటూ అనడమే కాక, రౌడీ బాయ్ అంటూ చివరిగా సమాధానం చెప్పడంతో విజయ్ దేవరకొండతో బంధం గురించి కాసిన్ని డౌట్లు కూడా పూర్తిగా తీరిపోయాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఆనంద్ కు సంబంధించిన ఈవెంట్లకు వస్తూనే ఉంటుంది. బేబీ పాట లాంచ్ కు విచ్చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు గంగం గణేశాకు సైతం టైం ఒత్తిడి ఉన్నా సరే మిస్ చేయలేదు. ఆలస్యంగా అయినా హాజరయ్యింది. ఆనంద్ గురించి రష్మిక చెప్పిన మాటలు, క్వశ్చన్ అడిగినప్పుడు మ్యూట్ లో మాత్రమే వినాల్సిన ఒక మాట ను చనువుగా అనడం ఇవన్నీ సాధారణ బాండింగ్ లో వచ్చేవి కావు. మన ఫ్యామిలీ అని రష్మికనొక్కి చెప్పడం బట్టి విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి వస్తున్న కథలకు బలం చేకూరినట్టయ్యింది.
మొత్తానికి గంగం గణేశాకు మైలేజ్ వచ్చేసింది. ఈవెంట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలోని పాటకు లయబద్ధంగా రష్మిక, ఆనంద్ తో పాటు ఇతర టీమ్ సభ్యులు కాలు కదపడం ఆకట్టుకుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగంతో పోటీ పాడుతున్న గంగం గణేశా ప్రమోషన్ల కోసం ఆనంద్ టీమ్ ఎడతెరిపి లేకుండా పబ్లిసిటీ చేస్తూనే ఉంది. కామెడీ క్రైమ్ జానర్ లో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ ఆకట్టుకుని ఓపెనింగ్స్ తెచ్చుకునేందుకు మంచి స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు.
This post was last modified on May 28, 2024 10:17 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…