Movie News

కీరవాణిని అలా చూస్తే ఎలాగబ్బా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నపుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆధిపత్యం చేస్తున్న ఆంధ్రా వారి మీద ఉద్యమకారులు విమర్శలు చేయడం.. తెలుగు సినిమాను వాళ్లు చెరబట్టారని ఆరోపణలు చేయడం.. కొన్నిసార్లు సినిమా షూటింగ్ బృందాల మీద దాడులకు కూడా పాల్పడడం గుర్తుండే ఉంటుంది.

వారి ఆవేశంలో, ఆవేదనలో అర్థం ఉందని కొందరు అనేవాళ్లు. కొందరు దీన్ని తప్పుబట్టేవాళ్లు. ఐతే రాష్ట్రం రెండుగా విడిపోయి దశాబ్దం దాటిపోయింది. తెలంగాణ మీద వివక్ష అనే చర్చే పక్కకు వెళ్లిపోయింది.

సినిమా వాళ్లంతా ఉండేది హైదరాబాద్‌లోనే కాబట్టి వాళ్లు తెలంగాణ ప్రాంతవాసులుగానే గుర్తింపు పొందుతున్నారు. ఇక్కడి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలతో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగిపోతున్నారు.

ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సర్వపరిచే బాధ్యతను రేవంత్ రెడ్డి సర్కారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం మీద వివాదం మొదలవడం గమనార్హం. ఈ విషయాన్ని ఖండిస్తూ తెలంగాణ సంగీతకారుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసింది. తెలంగాణ గీతాన్ని ఆంధ్రా మూలాలున్న కీరవాణికి అప్పగించడాన్ని వాళ్లు తప్పుబట్టారు.

మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రం మనదని, ఆంధ్రాకు చెందిన కీరవాణికి ఈ ఛాన్స్ ఇవ్వొద్దని ఈ లేఖలో పేర్కొన్నారు. కానీ వేరే సంగీత దర్శకుడైతే ఏమో కానీ.. బాలీవుడ్లోనూ ఎన్నో సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన, ఆస్కార్ అవార్డు కూడా గెలిచి ప్రపంచ స్థాయికి ఎదిగిన కీరవాణి మీద ఒక ప్రాంత ముద్ర వేసి విమర్శలు చేయడం ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా బాధ కలిగించేదే. చరిత్రలో ఎందరో గొప్పవాళ్లున్నారు. వాళ్లందరినీ కూడా ఇలా ప్రాంతాల వారీగా విడదీసి చూస్తే తెలుగువారి ఉమ్మడి వారసత్వ సంపద సంగతేంటో?

This post was last modified on May 28, 2024 7:11 am

Share
Show comments
Published by
Satya
Tags: Keeravani

Recent Posts

ప్రశాంత్ వర్మకు మొదటి షాక్ తగిలింది

నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…

38 mins ago

జమిలి వచ్చినా.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…

40 mins ago

బాలీవుడ్ బేబీకి హీరో దొరికాడు

ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…

49 mins ago

ఆంధ్రోడి సగటు అప్పు లెక్క కట్టిన కాగ్

పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…

2 hours ago

జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్

అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago