సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం క్యాన్సిలైపోయిందనే వార్త నిన్న ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో టెన్షన్ వచ్చేసింది. దీనికి తోడు కొద్దిరోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో షూటింగ్ ఆగస్ట్ నుంచి ఉంటుందనే అధికారిక ప్రకటన ఈ పుకారుకి మరింత బలం చేకూర్చేలా చేసింది. తాజాగా దీనికి సలార్ టీమ్ స్పందించింది. ప్రభాస్, నీల్ ఇద్దరూ నవ్వుకుంటున్న ఒక ఫోటో పెట్టి వీళ్ళు ఆపలేరు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా క్లారిటీ వచ్చేసింది. అంటే సీక్వెల్ కి ఎలాంటి ఢోకా లేదని అర్థం
అసలా గాసిప్ ఎందుకు పుట్టిందనేది పక్కనపెడితే సలార్ 2 మీద పక్కా ప్లానింగ్ ఎప్పుడో జరిగిపోయింది. పార్ట్ టూలో ఏముండాలనేది క్యాస్టింగ్ తో సహా మొత్తం ఎప్పుడో నిర్ణయించేసుకున్నారు. జగపతి బాబు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే ప్రభాస్ డేట్లు అందుబాటులో లేని కారణంగా సలార్ 2 ఆలస్యం చేసి ఈలోగా తారక్ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది నీల్ ఆలోచనగా తెలుస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ కొనసాగింపు విషయంలో రాజీ పడేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేదనే సంగతి మళ్ళీ చెప్పనక్కర్లేదు.
కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది వెంటనే చెప్పలేని పరిస్థితి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి తర్వాత వెంటనే ది రాజా సాబ్ లో బిజీ అయిపోతాడు. స్పిరిట్ స్క్రిప్ట్ తో సందీప్ రెడ్డి వంగా సిద్ధంగా ఉన్నాడు. కల్కి రెండో భాగం తీశారా లేక ఇంకా పెండింగ్ ఉందా అనేది నాగ అశ్విన్ చెబితే తప్ప తెలియదు. ఇంకోవైపు హను రాఘవపూడి తన ప్యాన్ ఇండియా మూవీ కోసం లొకేషన్లను వెతికి పట్టుకుని వర్క్ షాపులు చేస్తున్నాడు. మూడు పాటల కంపోజింగ్ అయిపోయింది. సో సలార్ 2 శౌర్యంగపర్వం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉండొచ్చు. ఏదైతేనేం డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన తీరిపోయింది.
This post was last modified on May 26, 2024 12:27 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…