ప్రతి ఏడాది జరిగే సంక్రాంతి సినిమాల పోటీలను విశ్లేషించుకుంటే 2017 అరుదైన వాటిలో ఒకటిగా నిలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి కంబ్యాక్ ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ డ్రీం ప్రాజెక్టు గౌతమిపుత్ర శాతకర్ణి పోటీని తట్టుకుని మరీ వాటితో పాటు పెద్దగా అంచనాలు లేని శతమానం భవతి ఘనవిజయం సాధించడం. అక్కడితో ఆగకుండా జాతీయ అవార్డుని కూడా అందుకుంది. అందుకే దిల్ రాజు దీన్ని చాలా స్పెషల్ మూవీగా ఫీలవుతారు. సందర్భం వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత జీవితాన్ని తెరమీద చూసుకున్న అనుభూతి ఇస్తుందని గుర్తు చేసుకుంటారు. దీనికి సీక్వెల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
శతమానం భవతి నెక్స్ట్ పేజీ టైటిల్ తో రూపొందబోయే ఈ ఫ్యామిలీ మూవీకి దర్శకుడు మారుతున్నాడు. సతీష్ వేగ్నేశ స్థానంలో ఎస్విసి సంస్థలో పదేళ్లుగా వివిధ శాఖల్లో పని చేస్తున్న హరి డెబ్యూ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజుగారి లవ్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. హీరో ఎవరనేది చెప్పలేదు కానీ శర్వానంద్ స్థానంలో ఈసారి ఆ ఛాన్స్ ఆశిష్ దక్కించుకున్నాడని ఇన్ సైడ్ న్యూస్. అధికారికంగా చెప్పలేదు కానీ స్క్రిప్ట్ లాక్ చేసుకునే క్రమంలో తనకిది మంచి బ్రేక్ అవుతుందని భావించి దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారని టాక్. షూటింగ్ త్వరలోనే ఉంటుంది.
2025 సంక్రాంతికి వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి శతమానం భవతి నెక్స్ట్ పేజీ అదే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే అవకాశముంది. ఈసారి బలమైన భావోద్వేగాలతో పాటు స్వయంగా దిల్ రాజు గారు అందించిన కథనే చక్కగా డెవలప్ చేశారని అంటున్నారు. రౌడీ బాయ్స్ తో పరిచయమైన ఆశిష్ కు లవ్ మీ సక్సెస్ కీలకం కానుంది. కొన్ని మార్పుల కోసం సెల్ఫిష్ ని పెండింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో పునఃప్రారంభం కావొచ్చు.ఆశిష్ సితార బ్యానర్ లో ఒక సినిమాతో పాటు శతమానం భవతి నెక్స్ట్ పేజీని సమాంతరంగా చేయొచ్చని వినికిడి.
This post was last modified on May 23, 2024 5:28 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…