ఈ రోజుల్లో టాలీవుడ్లోకి అడుగు పెట్టే పర భాషా హీరోయిన్లు చాలా ఈజీగా తెలుగు నేర్చేసుకుంటున్నారు. అచ్చమైన తెలుగమ్మాయిల్లా మన భాష మాట్లాడేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్లో ఉన్నా తెలుగు సరిగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. వేదికల మీద అందరికీ నమస్కారం అని ఒకట్రెండు మాలు తెలుగులో మాట్లాడి.. ఆ తర్వాత ఇంగ్లిష్‌లోకి వెళ్లిపోతుంటారు. ఈ జాబితాలో కాజల్ అగర్వాల్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
తన తోటి స్టార్ హీరోయిన్లు చాలామంది తెలుగులో గలగలా మాట్లాడేస్తుంటే.. కాజల్ మాత్రం ఇంగ్లిష్‌కే పరిమితం అవుతుంటుంది. ఇదే విషయమై ఓ అభిమాని అభ్యంతర పెడితే కాజల్ ఆసక్తికర రీతిలో స్పందించింది. తన కొత్త చిత్రం ‘సత్యభామ’ను ప్రమోట్ చేసే క్రమంలో నెటిజన్లతో చిట్ చాట్ సందర్భంగా తన ‘తెలుగు’ గురించి కాజల్ మాట్లాడింది.
హర్ష అనే అభిమాని సోషల్ మీడియాలో తన గురించి పెట్టిన పోస్ట్‌ను కాజల్ చదివి వినిపించింది. “ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతోంది. మీకు తెలుగులో ‘అందరికీ నమస్కారం’ తప్ప ఏం రాలేదేంటి? ప్లీజ్ నాకోసం తెలుగులో ఆ నమస్కారం కాకుండా వేరేది ఏదైనా మాట్లాడండి” అని ఆ అభిమాని అందులో పేర్కొన్నాడు.
దీనికి కాజల్ బదులిస్తూ.. “ఏం మాట్లాడుతున్నావు హర్ష. నాకు తెలుగు రాకపోవడం ఏంటి? ఇదేనా నా గురించి నీకు తెలిసింది? నా తెలుగు అంతా మనసులో ఉంటుంది. కానీ తెలుగులో మాట్లాడాలంటే డౌట్ వస్తుంది. ఇది రైటా రాంగా అని. కానీ నాకు తెలుగు బాగా తెలుసు. ఇప్పుడు మాట్లాడుతుంటే ఫీల్ బాగా ఉంది. కెమెరా ముందు మాట్లాడకపోతే నాకు తెలుగు రానట్లేనా? సరే కావాలంటే చూడు. ఈసారి సత్యభామ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతా” అని కాజల్ స్పష్టం చేసింది.
This post was last modified on May 23, 2024 2:50 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…