ఈ ఏడాది ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కల్కి’ ఒకటి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. పైగా ‘కల్కి’ హాలీవుడ్ స్టయిల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో ఇది తెరకెక్కడం.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉండడంతో ఇది ఒక ఎపిక్ మూవీ అవుతుందనే అంచనాలున్నాయి.
ఐతే ఈ సినిమా స్థాయికి తగ్గట్లుగా దీన్ని ప్రమోట్ చేయట్లేదనే అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ‘కల్కి’ ఫస్ట్ లుక్ అప్పట్లో ఎంత ట్రోలింగ్‌కు గురైందో తెలిసిందే. తర్వాత వచ్చిన టీజర్ ఓకే అనిపించడంతో సినిమా మీద ఆశలు పెంచుకున్నారు.
లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలా డిజైన్ చేసిన బుజ్జి అనే అల్ట్రా మోడర్న్ కారును ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం ఒక ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేశారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఈవెంట్‌కు సెలక్టివ్‌గా అభిమానులను, అలాగే వివిధ ప్రాంతాల నుంచి మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. కానీ ఈ ఈవెంట్ అనుకున్న స్థాయిలో సినిమాకు హైప్ తీసుకురాలేకపోయింది. అసలీ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో సరిగా హైప్ రాలేదు. ఇంత భారీ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ జరిగితే సోషల్ మీడియా హోరెత్తిపోవాలి. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. టీజర్ కూడా జస్ట్ యావరేజ్ అన్నట్లు ఉండడం కూడా ప్రతికూలమైంది.
ఈ సినిమా రేంజ్ ఏంటి.. జరుగుతున్న ప్రమోషనేంటి.. వదులుతున్న కంటెంట్ ఏంటి అని ప్రభాస్ అభిమానులే కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి భారీ చిత్రాలను రాజమౌళి ప్రమోట్ చేసే తీరు.. ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. నాగ్ అశ్విన్ అండ్ టీం రాజమౌళిలా ప్రమోషన్లను డిజైన్ చేసి, కంటెంట్ మరింత ఎగ్జైటింగ్‌గా ఉండేలా చూసుకుంటేనే ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 23, 2024 2:44 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…