బాగా గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ సోలోగా టైటిల్ రోల్ చేసిన సినిమా సత్యభామ. ఈ నెల 31 విడుదల కావాల్సి ఉన్నా కొత్తగా వదులుతున్న పోస్టర్లలో డేట్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేశాలతో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో జూన్ 7 వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు కనక సత్యభామ ప్రమోషన్ భారం మొత్తం కాజల్ మీదే పడింది. కమర్షియల్ మూవీ కాకపోవడంతో ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్లడానికి టీమ్ బాగా కష్టపడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిసిటీలో స్టార్లు భాగమైతే మంచిదే. అందుకే ఎల్లుండి 24 జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కాజల్ ఇటీవలే భగవంత్ కేసరి చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడది ఈ రూపంలో ఉపయోగపడుతోంది. తర్వాతి వారం చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని టాక్. ఖైదీ నెంబర్ 150 ద్వారా చిరుతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న కాజల్ కు ఆచార్య విషయంలో కలిగిన అసంతృప్తిని సత్యభామ వేడుకకు హాజరు కావడం ద్వారా చిరు కొంతైనా తీర్చవచ్చు.
మొత్తానికి చిరంజీవి, బాలకృష్ణల మద్దతు సత్యభామకు ఉపయోగపడేలా ఉంది. క్రైమ్ జానర్ లో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీకి గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాక సమర్పకుడిగా వ్యవహరించాడు. సో కంటెంట్ మీద నమ్మకం పెట్టుకోవచ్చన్న భరోసా అయితే దక్కింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. క్వీన్ అఫ్ మాసెస్ గా కొత్త ట్యాగ్ తో ప్రమోట్ అవుతున్న కాజల్ అగర్వాల్ కు ఆపై జూలైలో విడుదల కాబోతున్న భారతీయుడు 2 మరో కీలక మలుపు కానుంది. రెండు హిట్టయితే ఇక చెప్పేదేముంది.
This post was last modified on May 22, 2024 5:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…