రెగ్యులర్ హీరోయిజంకి భిన్నంగా కొత్త తరహా పోకడను తీసుకొచ్చి ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్రకు కన్నడ, తెలుగులో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ సినిమా నుంచే ఇది మొదలయ్యింది.
పూర్తి స్థాయి నటుడిగా మారాక డైరెక్షన్ తగ్గించేసిన ఉప్పి దాదా ప్రస్తుతం యుఐ (నామం సింబల్) చేస్తున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వదిలిన టీజర్ వెరైటీగా అనిపించింది. అప్పటి నుంచి రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే దాని గురించి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ అవి ఎంతకీ ఫలించడం లేదు.
సమస్య సరైన విడుదల తేదీ దొరక్కపోవడం దగ్గర వస్తోంది. దీని మీద నిర్మాణ సంస్థ లహరి విపరీతంగా ఖర్చు పెట్టేసింది. వంద కోట్లకు పైగానే అయినట్టు శాండల్ వుడ్ టాక్. ఇంత మొత్తం రికవరీ కావాలంటే కాంతార రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావాలి. అంటే పోటీ ఉండకూడదు. కానీ యుఐకి మంచి డేట్ దొరకడమే సవాల్ గా మారింది. జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి వారం ఏదో ఒక భారీ చిత్రం ఉంది.
కనీసం రెండు వారాల గ్యాప్ లేనిదే ఓపెనింగ్స్ పరంగా వర్కవుట్ కాదు. పైగా మీ మెదడుకు పరీక్ష పెడతానని ఉపేంద్ర ముందే హింట్ ఇచ్చాడు కాబట్టి కంటెంట్ ఆషామాషీగా ఉండదు.
క్రమం తప్పకుండా ఏదో ఒక టాక్ ఉండేలా ప్రమోషన్లు చేస్తున్నారు కానీ త్వరలోనే డేట్ ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. సన్నీ లియోన్, మురళీశర్మ, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న యుఐకి విరూపాక్ష – మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.
తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక క్రియేటివ్ పాయింట్ తో ఉపేంద్ర దీన్ని రూపొందిస్తున్నారట. దర్శకుడిగా 2015లో ఉప్పి 2 చేశాక తిరిగి డైరెక్షన్ చేసింది యుఐ తోనే. తొమ్మిదేళ్ల గ్యాప్ కి న్యాయం జరగాలి మరి.
This post was last modified on May 22, 2024 10:39 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…