తెలుగులో సీతారామంతో టాలీవుడ్ డెబ్యూనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న మంచి విజయాన్ని నమోదు చేసింది. వరస ఆఫర్లు వస్తున్నా సరే ఆచితూచి అడుగులు వేసిన మృణాల్ కు విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ఫలితం హ్యాట్రిక్ సక్సెస్ దక్కకుండా అడ్డు పడింది. ఇది మాములు ఫ్లాప్ కాదు. దీని సంగతలా ఉంచితే ఈ అమ్మడి దృష్టి ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉన్నట్టు స్పష్టమవుతోంది. గతంలో విశ్వంభర ఆఫర్ వచ్చినా ఎక్కువ డేట్లు అవసరమైతే హిందీ అవకాశాలకు ఇబ్బందవుతుందని నో చెప్పినట్టు ఆల్రెడీ టాక్ ఉంది.
దానికి తగ్గట్టే మృణాల్ తాజాగా సంజయ్ లీలా భన్సాలీ సంగీతం ప్లస్ నిర్మాణంలో రూపొందే ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు పచ్చజెండా ఊపింది. సిద్దాంత్ చతుర్వేది హీరోగా శ్రీదేవి చివరి సినిమా మామ్ తో ఆడియన్స్ ని మెప్పించిన రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమకథే అయినప్పటికీ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ పాయింట్ తో ఉంటుందట. ఈ ప్రాజెక్టు ఒప్పుకోవాలనే ఉద్దేశంతోనే సౌత్ నుంచి వెళ్లిన రెండు ఛాన్సులకు మృణాల్ నో చెప్పిందని వినికిడి. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కే ప్యాన్ ఇండియా మూవీకి తన పేరు పరిశీలనలో ఉందని యూనిట్ లీక్.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ మొత్తానికి మృణాల్ ఫోకస్ మాత్రం ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉందన్నది స్పష్టం. సీతారామం తర్వాత తనవి మూడు హిందీ సినిమాలు రిలీజైతే ఏదీ సక్సెస్ కాలేదు. రామ్ రెడ్ రీమేక్ గుంరాహ్ సైతం సోసో ఫలితాన్నే అందుకుంది. మూడు పదుల వయసులో వేగం పెంచిన మృణాల్ ఠాకూర్ ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అదేదో తెలుగులోనే ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇక్కడే సెటిలయ్యేదని అభిమానులు ఫీలవుతున్నారు కానీ తన మనసులో ఏముందో చేతల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోందిగా.
This post was last modified on May 22, 2024 12:31 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…