మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదనే డిజాస్టర్ బ్రహ్మోత్సవం. అప్పట్లో దీని మీద వచ్చిన హైప్, ప్రమోషన్ అంత సులభంగా మర్చిపోయేది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా హోమ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కట్ చేస్తే మొదటి ఆటకే దారుణమైన టాక్ తో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ టైంలో 5జి టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ట్రోలింగ్ గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇక ఆర్టిస్టుల సంగతి సరేసరి. ఈ ఫ్లాప్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతారు.
కానీ కాజల్ అగర్వాల్ షాక్ ఇచ్చింది. తన కెరీర్ లో ఇష్టమైన సినిమాల్లో బ్రహ్మోత్సవంలో చేసిన పాత్ర మొదటిదని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. నిజానికి అందులో సమంతా మెయిన్ హీరోయిన్. కాజల్ ఫస్ట్ హాఫ్ తర్వాత కనిపించదు. అయినా సరే ఇంత ప్రత్యేకంగా కాజల్ దాని గురించి చెప్పడం విచిత్రమే. తను టైటిల్ రోల్ పోషించిన సత్యభామ ఈ నెల 31 విడుదల కానుంది. దాని ప్రమోషన్లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పుకొచ్చింది. ఇలా ఒక ఫ్లాప్ మూవీ గురించి గొప్పగా ప్రస్తావించడం అరుదనే చెప్పాలి.
పెళ్లి చేసుకున్నాక కొంత బ్రేక్ తీసుకున్న కాజల్ అగర్వాల్ తిరిగి సత్యభామ తనకు బ్రేక్ ఇస్తుందని ఎదురు చూస్తోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటి బలమైన పోటీ ఉన్నా సరే నిర్మాతలు మాత్రం వెనుకడుగు వేసే ఆలోచన చేయడం లేదు. పోలీస్ ఆఫీసర్ గా కథ మొత్తం తన భుజాల మీద నడిచే పాత్రను ఇందులో కాజల్ పోషించింది. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గూఢచారి, మేజర్ దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. సుమన్ చిక్కాల దర్శకుడు. టీమ్ బాగుంది కాబట్టి ఇదేదో మంచి క్రైమ్ థ్రిల్లరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on May 22, 2024 7:41 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…