వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. గీత గోవిందం కాంబో మేజిక్ రిపీట్ చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పరశురామ్ పూర్తిగా నీరు గార్చేశాడు. అయినా సరే రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్. ఇక్కడితో అయిపోలేదు. ఫ్యాన్స్ మబ్బుల్లో తేలిపోయే వార్త మరొకటి ఉంది.
సుమారు మూడేళ్ళ క్రితమే విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ కలయికలో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ కార్యరూపం దాల్చలేదు. పుష్ప 2 తర్వాత ఉంటుందేమో అనుకుంటే ఈలోగా రామ్ చరణ్ 16 అనౌన్స్ మెంట్ వచ్చింది. ఎంతలేదన్నా ఇది రిలీజయ్యేలోపు 2026 దాటిపోవచ్చు. ఇవాళ జరిగిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ కొంత ఆలస్యమైనా విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని, క్యాన్సిల్ కాలేదనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది.
అనడమైతే అన్నారు కానీ ఇది అంత సులభంగా జరిగేది కాదు. ఎందుకంటే పుష్ప కోసం అయిదేళ్ళు ఖర్చు పెట్టిన సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కోసం ఎంతలేదన్నా రెండు మూడు సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికి విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. సరే పోనీ ఎలా ఉన్నా మాట ఇచ్చాము కాబట్టి తీయాలనుకున్నా పెరిగిన సుకుమార్ ఇమేజ్ కి తగ్గట్టు అది మాములు స్కేల్ లో ఉండకూడదు. వందల కోట్ల బడ్జెట్ అయితేనే ఆయన స్థాయికి తగ్గట్టు ఉంటుంది. మరి లేట్ అయినా ఈ ఇద్దరు చేతులు కలుపుతారా లేక ఇది తాత్కాలిక ఆనందమేనా అనేది వేచి చూడాలి.
This post was last modified on May 20, 2024 6:35 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…