Movie News

చిరంజీవి మాటిచ్చింది ఏ దర్శకుడికి

విశ్వంభర షూటింగ్ తప్ప వేరే ప్రపంచం లేకుండా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. గత ఏడాది కూతురు సుష్మితని ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మార్చే క్రమంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఓకే చేసి, ఆ తర్వాత భోళా శంకర్ ఫలితం చూసి వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అదే కథను రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కొన్ని కీలక మార్పులు చేసి త్రినాథరావు నక్కినకు ఇస్తే ఆయన దాన్ని చక్కగా సందీప్ కిషన్ తో సెట్ చేసుకున్నాడు. చిరు దగ్గరకు రెగ్యులర్ గా డైరెక్టర్లు వస్తున్నారు, లైన్లు వినిపించి వెళ్లిపోతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ బ్రో చేశాక అన్నయ్య సినిమా ఒకటి చేయాలనేది టిజి విశ్వప్రసాద్ టార్గెట్. ఈ కారణంగానే అమెరికాలో చిరు సన్మాన సభ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారనే టాక్ ఉంది. తమ బ్యానర్ లోనే మిస్టర్ బచ్చన్ చేస్తున్న హరీష్ శంకర్ తో ఓ స్టోరీ చెప్పించారు. కానీ అది ఫైనల్ కాలేదట. గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజా కూడా లైన్ లోనే ఉన్నాడట. కానీ అతను తమిళంలో తమ్ముడు జయం రవితో తని ఒరువన్ 2 (ధృవ సీక్వెల్)లో బిజీగా ఉన్నాడు. పూర్తయ్యేలోపు ఏడాది గడిచేలా ఉంది.

సో ఇప్పటికిప్పుడు చిరు ఎవరితో చేయబోయేది వెంటనే చెప్పలేం. పీపుల్స్ మీడియాకి ఓకే చెప్పినా ఆ ప్రాజెక్టులో సుష్మిత భాగస్వామిగా ఉంటుందట. మొత్తం ఫైనల్ కావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. హరీష్ శంకర్, మోహన్ రాజాలలో ఎవరికి ఎస్ చెప్పినా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కన్నా ముందు షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలు కేటాయించబోతున్న నేపథ్యంలో ఇండిపెండెన్స్ డేకన్నా ముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో వశిష్ట పని చేస్తున్నాడు. ఆరు నూరైనా జనవరి 10 విడుదలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని యువి వర్గాలు అంటున్నాయి.

This post was last modified on May 20, 2024 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

57 minutes ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

59 minutes ago

ఇక్కడ 13 వేల కోట్ల స్కాం.. అక్కడ ఆమ్మాయికి దొరికేశాడు

భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…

1 hour ago

సాయిరెడ్డి సీటు ఎవ‌రికిస్తారు బాబూ?

తాజాగా మ‌రో రాజ్య‌స‌భ సీటుకు సంబంధించి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. వైసీపీ నాయ‌కుడు, కీల‌క నేత‌ల వేణుంబాకం విజ‌య‌…

2 hours ago

AI విప్లవం – సినిమా రంగంపై ప్రభావం

ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…

3 hours ago