దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే దాని గురించి రకరకాల ఊహాగానాలు జరిగాయి. ఫైనల్ గా వాటికి చెక్ పడింది. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ వైపే నీల్ మొగ్గు చూపుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో టైటిల్ చెప్పకపోయినా ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టంగా పేర్కొనడంతో ఇకపై దీని గురించి ఎక్కువ డౌట్ పెట్టుకోవడానికి లేదనే చెప్పాలి. అయితే ఇక్కడితో ట్విస్టులు అయిపోయాయని అనుకోవడానికి లేదు.
దేవర పార్ట్ 1 నుంచి జూనియర్ ఎన్టీఆర్ జూలై లోపే ఫ్రీ అవుతాడు కాబట్టి దానికి అనుగుణంగా ప్రశాంత్ నీల్ తన ప్యాన్ ఇండియా మూవీకి ఆగస్టని ఫిక్స్ అయ్యుండొచ్చు. అయితే వార్ 2 ఇంకో వైపు జరుగుతోంది కనక దాని చిత్రీకరణ డిసెంబర్ లోగా పూర్తి చేసి బల్క్ డేట్లు కెజిఎఫ్ దర్శకుడికే కేటాయించేలా తారక్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. మరి దేవర 2 సంగతేంటంటే మొదటి భాగంతో పాటు సమాంతరంగా పూర్తి చేస్తున్నారనే మాట వినిపిస్తోంది కానీ కొరటాల శివ చెబితే తప్ప దీన్ని నమ్మలేం. ఒకవేళా అబద్దమైతే 2025 వేసవి టైంలో రెండో దేవరను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఎందుకు పక్కనపెట్టారనే పాయింట్ కు వస్తే ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా అది కెజిఎఫ్ రేంజ్ లో యునిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదనేది వాస్తవం. అందుకే అర్జెంట్ గా రెండో పార్ట్ చూసేయాలన్న ఆత్రం బాహుబలి స్థాయిలో ప్రేక్షకుల్లో లేదు. ఇంకొంత సీరియస్ హోమ్ వర్క్ చేసి ఏడాది ఆలస్యమైనా సరే బెస్ట్ అనిపించుకునే స్థాయిలో ప్లాన్ చేస్తారని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ప్రభాస్ ఎలాగూ రాజా డీలక్స్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలతో బిజీ అయిపోతాడు కాబట్టి ఈలోగా ప్రశాంత్ నీల్ ప్రశాంతంగా తారక్ మూవీని పూర్తి చేయొచ్చు.
This post was last modified on May 20, 2024 3:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…