ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే అతడు హీరో పవన్ కళ్యాణ్ అయ్యేవాడు. ఇడియట్ విషయంలోనూ అలా జరగడం వల్లే రవితేజకు కెరీర్ బెస్ట్ బ్రేక్ దొరికింది.
అన్నీ హిట్ మూవీస్ కే ఇలా జరుగుతుందని కాదు. కొన్నిసార్లు అదృష్టవశాత్తు డిజాస్టర్లు తప్పుతుంటాయి. కొన్ని నెలల క్రితం న్యాచురల్ స్టార్ నాని తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన లైన్ కి సానుకూలంగా స్పందించాడు. ఫుల్ వెర్షన్ కోసం హైదరాబాద్ లో ఒక ఆఫీస్ తీసి పనులు చేశారు. కానీ ఫైనల్ వెర్షన్ కుదరలేదు.
దీంతో నాని ఆ ప్రాజెక్టుని వదులుకున్నాడు. కాలేజీ డాన్ ని డీల్ చేసిన విధానం చూసి కోరి మరీ ఛాన్స్ ఇచ్చాడు కానీ స్టోరీ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల నో చెప్పాల్సి వచ్చింది. కట్ చేస్తే దాన్నే సిబి శివ కార్తికేయన్ తో పట్టాలు ఎక్కించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
తనకు డాన్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చిన కారణంగా ఇది చేద్దామని మాట ఇచ్చాడట. నాని ఆ మధ్య ఒక ఫంక్షన్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు చేస్తే మంచి సినిమా అవుతుందని శివ కార్తికేయన్ కు చెప్పడంతో ఇది పట్టాలు ఎక్కేందుకు ఒక కారణమయ్యిందని అంటున్నారు. అలా చేతులు మారింది.
హీరోయిన్ గా రష్మిక మందన్నతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, డేట్లు కుదిరితే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారని తెలిసింది. ఇతర తారాగణం, టీమ్ వివరాలు తెలియదు కానీ ప్యాన్ ఇండియా బడ్జెట్ తోనే తెరకెక్కిస్తారట.
కాకపోతే కొన్ని నెలల టైం పట్టేలా ఉంది. దసరా లేదా దీపావళికి మొదలుపెట్టొచ్చు. నానికి కన్విన్సింగ్ గా చెప్పలేకపోయిన సిబి ఎలాగైతేనేం తన బ్రేక్ ఇచ్చిన హీరోతోనే ఓకే చేయించుకున్నాడు. రష్మిక కనక ఓకే చెబితే దీని స్కేల్ పెరిగిపోయి హిందీ వెర్షన్ కూడా మంచి రేట్ రాబట్టుకోవచ్చని నిర్మాత ప్లాన్. అంతేగా మరి.
This post was last modified on May 19, 2024 6:49 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…