చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుంది. కనీస నిర్వహణ ఖర్చులు కూడా వసూలు కానంత దీనంగా కలెక్షన్లు రావడంతో తెలంగాణలో పలు సింగల్ స్క్రీన్లు రెండు వారాల పాటు మూసేసిన సంగతి తెలిసిందే. ఇదేమి ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాకపోయినా స్వచ్చందంగా బందులో పాలు పంచుకున్నవాళ్ళే ఎక్కువ. నెలన్నరకు పైగా ఇదే పరిస్థితి ఉండటంతో ఇంతకు మించి యాజమాన్యాలకు వేరే గత్యంతరం లేకపోయింది.
నిన్న శుక్రవారం మినిమమ్ బజ్ ఉన్న ఒక్క సినిమా రిలీజ్ లేకపోవడంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రసాద్ మల్టీప్లెక్స్, ఆర్టిసి క్రాస్ రోడ్స్ లాంటివి బోసిపోయి కనిపించాయి. విచిత్రంగా పాత మూవీ అపరిచితుడుకి సుదర్శన్ 35 ఎంఎంలో నిన్న ఉదయం, సెకండ్ షోలు ఒక్క టికెట్ మిగలనంతగా హౌస్ ఫుల్ అయిపోవడం గమనించాల్సిన విషయం. అంటే జనాలు టికెట్లు కొని థియేటర్లకొచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను యావరేజ్ గా అయినా సరే సంతృప్తి పరిచే సరైన కంటెంట్ రాకపోవడమే ఈ దుస్థితికి దారి తీసింది. గ్యాంగ్ అఫ్ గోదావరి లాంటివి చివరి నిమిషంలో తప్పుకోవడం గాయం మీద కారమే.
ఇరవై అయిదున రిలీజ్ కాబోతున్న లవ్ మీ గురించి హీరో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ తెరిపిస్తామని ధీమాగా చెప్పాడు. నిర్మాత దిల్ రాజుతో సహా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది ఇదే. పబ్లిక్ తో మళ్ళీ హాళ్ళన్నీ కళకళలాడాలి. హనుమాన్, టిల్లుస్క్వేర్ , గుంటూరు కారంకు చూసిన హడావిడి కనిపించాలి. కలెక్షన్ల లెక్కలతో ట్రేడ్ బిజీ అయిపోవాలి. రికార్డుల వార్తలు మీడియాలో వస్తూ ఉండాలి. ఇవేవి లేకపోవడం వల్లే ఎన్నికలు, ఐపీఎల్ అంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. జూన్ 27 కల్కి వచ్చేలోపే బాక్సాఫీస్ వాతావరణం కుదుటపడితే జరిగేది అద్భుతాలే
This post was last modified on May 18, 2024 11:14 am
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…