Movie News

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష కూటమిలో ఎవరు గెలుస్తారనే దాని మీద లెక్కలేనన్ని విశ్లేషణలు, అంచనాలు జరుగుతూనే ఉన్నాయి. మాములుగా ఎలక్షన్లయ్యాక విన్నింగ్ పార్టీ మీద ఒక పాజిటివ్ వైబ్ ముందు నుంచే ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది టిడిపి జనసేనకే ఉందని ఒక వర్గం భావిస్తుండగా, వైసిపి ప్రతినిధులు ఏకంగా సిఎం ప్రమాణ స్వీకార వేదిక, తేదీ గురించి ప్రకటనలు కూడా ఇస్తున్నారు. దీనికి కాసేపలా ఉంచి అసలు విషయానికి వచ్చేద్దాం.

హిందుపూర్ తరఫున పోటీ చేసిన బాలకృష్ణ తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టబోతున్నారు. ముందుగా దర్శకుడు బాబీతో సితార ఎంటర్ టైన్మెంట్స్ కోసం చేస్తున్న భారీ చిత్రాన్ని పూర్తి చేయాలి. టైటిల్ ఇంకా నిర్ణయించని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు చిన్న టీజర్ అభిమానుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పటిదాకా నలభై శాతం దాకా పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. తమన్ పాటలు ఇచ్చేశాడని, వాటిని చిత్రీకరించడమే బాలన్స్ ఉందని అంటున్నారు. 2024లోనే విడుదల చేయాలనేది నిర్మాత టార్గెట్. దసరాకు దేవర ఉంది కాబట్టి ఛాన్స్ లేదు. దీపావళిని టార్గెట్ చేసుకోవచ్చు.

కాకపోతే అంత తక్కువ టైంలో పూర్తి చేయగలరా లేదా అనే దాని గురించి జూన్ మొదటి వారంలోపు ఒక అంచనాకు రాబోతున్నారు. బాలయ్య నాన్ స్టాప్ గా డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ ప్రచారంలో ఆయన తన మీసకట్టు, హెయిర్ స్టైల్ ఏదీ మార్చకుండా బాబీ సినిమా కోసం ఏర్పాటు చేసుకున్న దాంతోనే పాల్గొన్నారు. ఏ మాత్రం మార్పు చేసినా గెటప్ పరంగా ఇబ్బందవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. ఇది పూర్తి కాగానే బోయపాటి శీను దర్శకత్వంలో సినిమాకు రెడీ అవ్వాలి. స్క్రిప్ట్ దాదాపు పూర్తయ్యిందట. ఆగస్ట్ లో ఫైనల్ నెరేషన్ ఉండొచ్చని వినికిడి.

This post was last modified on May 17, 2024 4:08 pm

Share

Recent Posts

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

18 minutes ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

28 minutes ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

2 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

4 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

5 hours ago