Movie News

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం అనిపించే ఒకరు మన జీవితాల్లోకి అడుగు పెట్టబోతున్నారు, వెయిట్ చేయండని పెట్టిన కొన్ని నిమిషాలకే విపరీతంగా వైరల్ కావడం మొదలయ్యింది. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా ఇది తన పెళ్లి గురించేనని అతి త్వరలో జీవిత భాగస్వామిని పరిచయం చేయబోతున్నాడంటూ చిత్ర విచిత్రమైన విశ్లేషణలతో లైవ్ షోలు షురూ చేశారు. నిజానికి ప్రభాస్ అందులో పెళ్లికి సంబంధించిన క్లూ ఇచ్చినట్టు అనిపిస్తున్నా విశ్వసనీయ సమాచారం మేరకు అదేమీ కాదని తెలిసింది.

అసలు విషయం ఏంటంటే కల్కి 2898 ఎడి ప్రమోషన్లకు టైం వచ్చింది. ఇంకో నలభై రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రోజుకో అప్డేట్ లేదా పబ్లిసిటీ కంటెంట్ తో ప్రేక్షకులకు రెగ్యులర్ టచ్ లో ఉంటేనే ఓపెనింగ్స్ కి చాలా బూస్ట్ అవుతుంది. ప్రభాస్ ప్రత్యేకంగా ఎలాంటి హడావిడి చేయకపోయినా రికార్డులు బద్దలవుతాయి కానీ కల్కి విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఇక్కడో లాజిక్ మిస్ కాకూడదు. ప్రభాస్ నిజంగా పెళ్లి గురించి కబురు చెప్పాలంటే ఇన్స్ టా ద్వారా కాదు, మరో రూపంలో మరో సందర్భం చూసి గుడ్ న్యూస్ చెబుతాడు.

సో కల్కి వేడిలో ఎలాంటి వ్యక్తిగత ముచ్చట్లు ఉండవని మర్చిపోకూడదు. ప్రభాస్ చెప్పబోయేది సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ లేదా మెయిన్ టీజర్ గురించని ఇన్ సైడ్ టాక్. ఇది కాసేపు పక్కనపెడితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మీద ఈటీవీ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభాస్ ఒక ఇంటర్వ్యూకు అతిధిగా వెళ్ళాడు. చక్రంలో పాటతో పాటు సాహిత్యానికి సంబంధించిన కబుర్లు పంచుకున్నాడు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఇన్స్ టా కన్నా ఇది ఆసక్తికరంగా ఉండేలా ఉంది. ఏదైతేనేం మొత్తానికి ప్రభాస్ ఈ రోజు హాట్ టాపిక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది నిజం.

This post was last modified on May 17, 2024 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డ్రగ్స్ వద్దు డార్లింగ్స్… ప్రభాస్ పిలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…

9 hours ago

ఏపీ పాలిటిక్స్ : 2024 పాఠం నేర్పిన తీరు.. !

2024.. మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్ర‌లో క‌లిసిపోనుంది. అయితే.. ఈ సంవ‌త్స‌రం కొంద‌రిని మురిపిస్తే.. మ‌రింత మందికి గుణ‌పాఠం చెప్పింది.…

9 hours ago

జ‌గ‌న్ ఇంటికి కూత‌వేటు దూరంలో… జెండా పీకేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు జేజేలు కొట్టి.. జ్యోతులు ప‌ట్టిన చేతులే.. నేడు క‌నుమ‌రుగు…

10 hours ago

నారా కుటుంబాన్ని రోడ్డెక్కించిన 2024 రాజ‌కీయం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న కుమారుడు, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి…

10 hours ago

2025లో బిజీబిజీగా టీమిండియా.. కంప్లీట్ షెడ్యూల్

2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…

11 hours ago