ఒకవైపు జనాలు రావడం లేదని తెలంగాణ సింగల్ స్క్రీన్ థియేటర్లు పది రోజులు మూసేయాలని నిర్ణయించుకుంటే ఇంకోవైపు రేపు రిలీజ్ కావాల్సినవి సైతం వాయిదా పడటం మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అవుతోంది. నముందు అనుకున్న ప్రకారం మే 17 రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి చివరి వారానికి వెళ్లిపోవడంతో కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన రాజు యాదవ్ ఒక్కటే చెప్పుకోదగ్గ ఛాయస్ గా నిలిచింది. అయితే జరుగుతున్న పరిణామాలు గమనించిన ఈ సినిమా టీమ్ వాయిదా వైపు మొగ్గు చూపడంతో ఇంకో బంగారం లాంటి సెలవుల శుక్రవారం హారతి కర్పూరం అయిపోయింది.
నెంబర్ పరంగా రేపు నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. దర్శిని, నటరత్నాలు, అక్కడ వారు ఉన్నారు. తమిళ డబ్బింగ్ మిరల్ దిగుతోంది. వీటిలో దేని మీద కనీస బజ్ కాదు కదా అసలు ఎవరు నటించారో కూడా ప్రేక్షకులకు అవగాహన లేదు. బడ్జెట్ పరిమితుల వల్ల భారీ ప్రమోషన్లు చేసుకోలేరు కాబట్టి ఆడియన్స్ కి రిజిస్టర్ కావడం జరగని పని. ఏదో అనూహ్యంగా అత్యద్భుతంగా ఉందనే టాక్ వస్తే తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో వేరే ఆప్షన్ లేక రీ రిలీజ్ అపరిచితుడుకే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కుతున్నాయి. ఈ ట్రెండ్ తగ్గుముఖం పట్టిన తరుణంలో స్పందన ఎలా ఉంటుందో చెప్పలేం.
నిర్మాతల మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ట్రేడ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మే 31న చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్న నాలుగు సినిమాలు క్లాష్ కావడం ఎవరికి లాభమని ప్రశ్నిస్తున్నారు. వాటిలో కనీసం రెండు రేపు వచ్చినా వసూళ్ల పరంగా ఫీడింగ్ జరిగేదని అంటున్నారు. వాళ్ళ మాటల్లో నిజం లేకపోలేదు. అయినా వినేవారెవరు. ఎన్నికలు అయిపోయి, స్కూల్ కాలేజీ పిల్లలు సెలవుల్లో ఉన్న కీలకమైన సమయంలో వినోదం కోసం సరైన సినిమాలే లేని దుస్థితి నెలకొంది. డీసెంట్ టాక్ తెచ్చుకున్న కృష్ణమ్మ లాంటివి సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి.
This post was last modified on May 16, 2024 12:02 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…