ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్తలు వచ్చేస్తున్నాయి. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూనే ఇంకోవైపు పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద దర్శకుడు నాగఅశ్విన్ తన బృందంతో కలిసి పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగా కల్కి కథ పూర్వ పరిచయం, పాత్రల తీరుతెన్నులతో కూడిన ఒక చిన్న యానిమేటెడ్ సిరీస్ త్వరలోనే ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిసింది. వీటి పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి.
ఒక్కొక్కటి ఇరవై నిమిషాల దాకా ఉండే నాలుగు ఎపిసోడ్లలో ఆయా పాత్రలకు ప్రభాస్ తో సహా కీలక పాత్రధారులే డబ్బింగ్ చెబుతున్నట్టు తెలిసింది. మే 22 హైదరాబాద్ లో ఒక భారీ ఫ్యాన్ మీట్ పెట్టి హైప్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లేలా చూస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సమయంలో డార్లింగ్ తన అభిమానులకు ప్రత్యక్షంగా కలుసుకోవడం కుదరలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదనే అసంతృప్తి వాళ్ళలో ఉంది. దీన్ని పూర్తిగా కల్కితో మాయం చేయబోతున్నారు. పాటలు, టీజర్, ట్రైలర్ గట్రా వ్యవహారాలకు ఎక్కువ టైం లేదు కాబట్టి మెట్రో స్పీడ్ లో పరుగులు పెట్టాల్సిందే.
జూన్ మొదటి వారం ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రెండు మూడు రోజులు బ్రేక్ వస్తుంది. దాన్ని మినహాయించి క్రమం తప్పకుండా అప్డేట్స్ ఉండేలా వైజయంతి బృందం మొత్తం రెడీ చేస్తోంది. లీకైన టీజర్ విజువల్స్ గా కొని షాట్స్ సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. కానీ అవి ఒరిజినల్ కాదట. ఇప్పటికైతే ఉండాల్సిన బజ్ కల్కికి ఇంకా లేదన్నది వాస్తవమే అయినా ఎన్నికల వేడి తగ్గిపోయిన నేపథ్యంలో ఇకపై జోరుని పెంచబోతున్నారు. దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ఇతర కీలక పాత్రలు పోషించిన కల్కికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.
This post was last modified on May 16, 2024 2:50 pm
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల…