రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్ మూవీస్ కే కాదు సమరసింహారెడ్డి లాంటి మాస్ బ్లాక్ బస్టర్లకు సైతం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయినా సరే బయ్యర్లు మాత్రం ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆపేలా లేరు. ఎల్లుండి మే 17 విక్రమ్ అపరిచితుడు భారీ ఎత్తున పునః విడుదల కానుంది.
దీనికొక్కటి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి తప్పుకోవడంతో రాజు యాదవ్ మినహా చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ బరిలో లేకుండా పోయింది.
అసలే ఎన్నికల తర్వాత థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మంచి ఆప్షన్లు లేకపోవడం అపరిచితుడుకి కలిసి వచ్చేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్టయ్యింది.
ముఖ్యంగా విక్రమ్ విశ్వరూపానికి టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హరీష్ జైరాజ్ పాటలు ఊపేశాయి. తప్పు చేసి జనాల ప్రాణాలతో ఆదుకునే వాళ్లకు కుంభీపాకం, నలపాకం అంటూ విక్రమ్ వేసే శిక్షలు, సమాజానికి ఇచ్చే సందేశం అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యాయి. టీవీలోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది.
అలాంటి అపరిచితుడుని మళ్ళీ అనుభూతి చెందడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపించినా ఆశ్చర్యం లేదు. క్రమంగా జనం ఫోకస్ రాజకీయాల నుంచి సినిమాల వైపు వస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం నిర్మాతల చేతుల్లో ఉంది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా మే 17తో పాటు ఆపై వారం కూడా వృథాగా వదిలేశారు.
దీంతో మే 31 ఏకంగా అయిదు చిత్రాలు తలపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎవరు తప్పుకుంటారో ఇంకా స్పష్టత లేదు. సో ఎలా చూసుకున్నా ఈ ఫ్రైడే రాజు యాదవ్ మీద ఆసక్తి లేనివాళ్లకు అపరిచితుడు తప్ప ఇంకో ఎంటర్ టైన్మెంట్ కనిపించడం లేదు. ఏ మేరకు వాడుకుంటాడో చూడాలి.
This post was last modified on May 15, 2024 10:00 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…