ఒకపక్క బాలీవుడ్ రామాయణంకు అడుగులు వేగంగా పడటంతో ఇంకోవైపు ఇలాంటి ఎపిక్ డ్రామాలను ప్లాన్ చేసుకున్న ఇతర హీరోలు, నిర్మాతలు అలెర్ట్ అయిపోతున్నారు. వాటిలో కర్ణ ఒకటి. సూర్య హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో ఈ భారీ ప్యాన్ ఇండియా మూవీని ఏడాది క్రితమే ప్లాన్ చేసుకుని ఆ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు.
కానీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ల్యాండ్ మార్క్ మూవీ దానవీరశూరకర్ణని మరిపించేలా ఒక గొప్ప గ్రాండియర్ ఆవిష్కరించే స్థాయిలో చాలానే సెట్ చేసుకున్నారు.
కానీ బడ్జెట్ తో పాటు సూర్య డేట్లు అందుబాటులో లేకపోవడంతో ఇన్నాళ్లు మొదలుపెట్టకుండా ఆపేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చిందని సమాచారం. కొంచెం బడ్జెట్ ని సవరించి సూర్య మార్కెట్ కు తగట్టు ఖర్చు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
అయినా ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా హనుమాన్ లాంటివి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినప్పుడు సూర్య రేంజ్ హీరోని పెట్టుకుని ఎందుకు ఆలోచించాలనే దిశగా చర్యలు మొదలయ్యాయని వినికిడి. స్వర్గీయ ఎన్టీఆర్, శివాజీగణేశన్ లను తలపించేలా ఈ పాత్రను పోషించడం సూర్యకు కత్తిమీద సామే.
ప్రస్తుతం కంగువ పూర్తి చేసే పనిలో ఉన్న సూర్యకు ఆ తర్వాత వెట్రిమారన్ వడివాసల్ ఉంది. ఇవి కాకుండా లోకేష్ కనగరాజ్ తో రోలెక్స్ అనుకుంటున్నారు కానీ ఇది ఇప్పట్లో కార్యరూపం దాల్చడం అనుమానమే. ఒకవేళ కర్ణ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా అయిపోతే ఇది సెట్స్ పైకి వెళ్లొచ్చు.
కాకపోతే కొంచెం టైం పట్టేలా ఉంది. అభిమానులు మాత్రం కంగువ విడుదల తేదీ కోసం డిమాండ్ చేస్తున్నారు. 2024 రిలీజ్ అని చెప్పడమే తప్ప ఇప్పటిదాకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా దాదాపు అన్ని శుక్రవారాలు బ్లాక్ అయిన నేపథ్యంలో కంగువ ఏది తీసుకుంటుందో చూడాలి
This post was last modified on May 15, 2024 9:58 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…