సూపర్ హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన తేజ సజ్జకి హనుమాన్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. హౌస్ అరెస్ట్ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ కొచ్చిన నిరంజన్ రెడ్డి రెండో మూవీతోనే టాప్ ప్రొడ్యూసర్ గా మారడం చూస్తే అనూహ్యం అనే మాట చిన్నదే. బలమైన కంటెంట్ పడితే తేజ సజ్జ ఈజీగా నెగ్గుకొస్తాడనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది. అందుకే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా భారీ బడ్జెట్ ని మిరాయ్ మీద పెడుతున్నారు. ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే తొందరపడకుండా తేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
తాజాగా పూరి జగన్నాధ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే లైగర్ దారుణమైన డిజాస్టర్ తర్వాత హీరోలెవరూ పూరి కథలకు సుముఖత చూపించలేదు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో మాస్ బ్రేక్ ఇచ్చాడు కాబట్టే ఆ కృతజ్ఞత ప్లస్ సబ్జెక్టు మీద నమ్మకంతో రామ్ డబుల్ ఇస్మార్ట్ కు ఓకే చెప్పాడు. ఇది కూడా రకరకాల కారణాలతో ఆలస్యమవుతూనే ఉంది. ఇది విజయం సాధిస్తేనే పూరి మీద మిగిలినవాళ్లకు తిరిగి గురి కుదురుతుంది. అదేంటో జూలై దాకా ఆగితే తప్ప తెలియదు. మరి తేజ సజ్జ ఇదేమి ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది ప్రశ్న.
పూర్తి వివరాలకు ఇంకా టైం పడుతుంది కానీ తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కెరీర్ ప్రారంభంలోనే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో బాచి చేశాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ బాలనటుడిగా తేజకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి లెక్కలు వేరే ఇప్పటి బిజినెస్ అంచనాలు వేరే. తేజకు పూరి చెప్పిన స్టోరీ ఓ రేంజ్ లో ఉంటే తప్ప ఈ కాంబో సాధ్యం కాదు. ప్రస్తుతానికి అధికారిక ముద్ర లేదు కాబట్టి ఈ వార్తని గాసిప్ గానే పరిగణనలోకి తీసుకోవాలి. మిరాయ్ విడుదలకు ఇంకో ఏడాది ఉంది. సో ఈలోగా వేగంగా ఇంకో సినిమా చేసే ఆలోచనలో తేజ సజ్జ ఉన్నాడేమో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on May 14, 2024 3:38 pm
దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’…
అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ…
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా…
తెలుగు నేల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా…
ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి క్వాలిటీతో పైరసీ ప్రింట్ ప్రత్యక్షం కావడం అభిమానులను నివ్వెరపరిచింది. రెగ్యులర్…
అయాన్ ముఖర్జీ అంటే తెలుగు ప్రేక్షకులకు ఇంతకు ముందు సుపరిచితమైన పేరు కాదు. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో…